బ‌ల్గేరియా షెడ్యూల్ పూర్తి చేసిన ప‌వ‌న్‌

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న 25వ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, బొమ‌న్ ఇరాని ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనిరుద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను, రెండు పాట‌ల‌ను చిత్రీక‌రించడానికి చిత్ర యూనిట్ బ‌ల్గేరియాకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. ఆ షెడ్యూల్ పూర్త‌య్యింద‌ని తెలిసింది.

ఇప్ప‌టికే చిత్ర బృందం హైద‌రాబాద్‌కి తిరుగు ప్ర‌యాణం లో ఉంద‌ని.. ప‌వ‌న్ మాత్రం లండ‌న్ వెళుతున్నార‌ని స‌మాచార‌మ్‌. అక్క‌డకి వెళ్లి ఇండియా, యురోపియా బిజినెస్ ఫోరం ప్రదానం చేయనున్న గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును స్వీకరించ‌నున్నారు ప‌వ‌న్‌. కాగా, అజ్ఞాత‌వాసి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమా ఆడియోని వ‌చ్చే నెల 14న విడుద‌ల చేయ‌నున్నారు.

More News

ప్ర‌ముఖ నిర్మాత‌తో శ్రీ‌కాంత్ అడ్డాల‌?

కొత్త బంగారు లోకం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు శ్రీ‌కాంత్ అడ్డాల‌. ఆ త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, విక్ట‌రీ వెంక‌టేష్‌ల‌తో సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు తెర‌కెక్కించాడు.

ఆయ‌న చ‌ర్య‌కు బాధ‌ప‌డ్డానంటున్నహీరోయిన్‌...

ర‌జ‌నీకాంత్‌తో 'క‌బాలి' సినిమాలో..ఆయ‌న కూతురు పాత్ర‌లో న‌టించిన ధ‌న్సిన అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మ‌డు బిజీ బిజీగా మారింది.

'జై సింహా' ఆడియో డేట్ ఫిక్స‌య్యింది

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 102వ చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార‌, న‌టాషా దోషి, హ‌రిప్రియ క‌థానాయిక‌లు.

2019 వేస‌వికి భార‌తీయుడు2?

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ద్విపాత్రాభిన‌యంలో ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందించిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మా శ్రమకు ఫలితమే ఈ నంది పురస్కారం..- దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్

భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా ఎంపికయ్యారు సుధాకర్ గౌడ్.