బల్గేరియా షెడ్యూల్ పూర్తి చేసిన పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, బొమన్ ఇరాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల కొన్ని కీలక సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ బల్గేరియాకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆ షెడ్యూల్ పూర్తయ్యిందని తెలిసింది.
ఇప్పటికే చిత్ర బృందం హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం లో ఉందని.. పవన్ మాత్రం లండన్ వెళుతున్నారని సమాచారమ్. అక్కడకి వెళ్లి ఇండియా, యురోపియా బిజినెస్ ఫోరం ప్రదానం చేయనున్న గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును స్వీకరించనున్నారు పవన్. కాగా, అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా ఆడియోని వచ్చే నెల 14న విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com