జగన్ సర్కార్ కూలిపోతుంది..: పవన్ జోస్యం
- IndiaGlitz, [Thursday,December 12 2019]
‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు నిరసన దీక్ష ముగిసింది. పవన్‌కు నిమ్మరసం ఇచ్చిన రైతులు ఆయన దీక్షను విరమింపజేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పవన్‌కు నిమ్మరసం ఇచ్చిన రైతులు ఆయన దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ‘రైతుకు పట్టం కట్టేందుకే ‘జనసేన’ ఉందన్నారు. అన్నదాత కన్నీరు ఆగే వరకూ తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల కన్నీళ్లు కారుస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా ఓటమిపాలైతే ఆ పార్టీకి చెందిన వారి ఆత్మసైర్యం దెబ్బతింటుంది కానీ, తనకు మాత్రం ఆత్మస్థైర్యం దెబ్బతినలేదని అన్నారు.
కచ్చితంగా కూలిపోతుంది!
‘నేను సూట్ కేసు కంపెనీలు పెట్టలేదు. సిమెంట్ ఫ్యాక్టరీలూ పెట్టలేదు. కాంట్రాక్టులు చేయను. నాకు తెలిసిందల్లా సినిమాల్లో నటించడమే.. ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమాలను ఆదరించారు.. నచ్చకపోతే పక్కనబెట్టారు. అందరికీ సెలవులుంటాయి కానీ రైతుకు మాత్రం ఉండవు. మన జగన్ రెడ్డి గారికి శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. ముఖ్యంగా నన్ను తిట్టే ఎమ్మెల్యేలకు సెలవులుంటాయి కానీ రైతుకు సెలవు లేదు. వైసీపీ ప్రభుత్వం పాలనను కూల్చివేతలతో ప్రారంభించింది.. భవన నిర్మాణ కార్మికుల జీవితాలను కూల్చివేసింది.. ఈ రోజు రైతులను కూల్చేస్తోంది.. ఇంతమందిని కూల్చేస్తున్న ఈ ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుంది’ అని పవన్ జోస్యం చెప్పారు.
వన్ అండ్ ఓన్లీ రాలేదు!
ఈ దీక్షకు జనసేనకు చెందిన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాకపోవడం గమనార్హం. పవన్‌కు నాకు మధ్యలో అడ్డంకులు ఉన్నాయని.. మా మధ్య అడ్డంకి తోలుగుతుందని భావిస్తున్నానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోతే ఉన్న ఇబ్బందుల తనకు తెలుసనని అన్నారు. చాలా మంది దళితులు పైవేటు పాఠశాలలో చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ దీక్షకు వెళ్లట్లేదని.. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు బలపరుస్తామని ఆయన మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే.