Janasena Party : పార్టీ జనాల్లోకి వెళ్లాలంటే.. క్రియాశీలక సభ్యులదే కీలకపాత్ర : సభ్యత్వ నమోదుపై పవన్ హర్షం
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పార్టీ నిర్మాణంలో క్రియాశీలక సభ్యుల పాత్ర కీలకమైనదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. జనసేన క్రియాశీలక సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ప్రజాపక్షం వహిస్తూ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయడంలో, పార్టీ విధివిధానాలను ప్రతి ఒక్కరికీ తెలియచెప్పడంలో క్రియాశీలక సభ్యుల భాగస్వామ్యం అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన కుటుంబంలో భాగమైన వారి కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించామని ఆయన గుర్తుచేశారు.
ఈ ఏడాది చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 3.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా చేరారని.. 7225మంది పార్టీ వాలంటీర్లు సభ్యత్వ నమోదులో పాలుపంచుకొన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ నమోదు పత్రాలతో కూడిన కిట్లు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగడం సంతోషంగా వుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ పి.ఎ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జిల్లా, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జులు, జిల్లా, నగర, మండల కమిటీల సభ్యులు, వీర మహిళ కమిటీ సమన్వయకర్తలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ, చేనేత, మత్స్యకార, డాక్టర్స్, లీగల్ విభాగాల చైర్మన్లు, సభ్యులు, అధికార ప్రతినిధులు, వీరమహిళలు, జనసైనికులకు పవన్ కల్యాణ్ అభినందనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోను క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ విజవంతంగా చేపట్టిన నాయకులను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో మరింత ముందుకు తీసుకువెళ్దామని పవన్ కల్యాణ్ .. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout