అన్న‌య్య సినిమా పై త‌మ్ముడు కామెంట్..!

  • IndiaGlitz, [Saturday,January 07 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈరోజు ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో భారీ స్ధాయిలో జ‌రుగుతుంది. అయితే...ఈ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌ర‌వుతారా..? లేదా..? అనేది ఆస‌క్తిగా మారింది.

ఈ నేప‌ధ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ లో అన్న‌య్య ఖైదీ నెం 150 మూవీ గురించి ట్వీట్ చేయ‌డం విశేషం. ఇంత‌కీ ప‌వ‌న్ ఏమ‌ని ట్వీట్ చేసారంటే....చ‌ర‌ణ్, మా వ‌దిన సురేఖ గారి నిర్మాణంలో తొలి చిత్ర‌మే చిరంజీవి గారి 150వ చిత్రం కావ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నెం 150 ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఈ చిత్రంలోని న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు నా మ‌నఃపూర్వ‌క శుభాకాంక్ష‌లు అని తెలిపారు.

More News

విజయశాంతి రీ ఎంట్రీ...?

లేడీ సూపర్ స్టార్ అంటూ ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి

డిఫరెంట్ హార్రర్ ఎంటర్ టైనర్ 'రాక్షసి' మోషన్ పోస్టర్ లాంచ్

హార్రర్ నేపథ్యంలో దర్శకుడు పన్నా రాయల్ రూపొందించిన 'కాలింగ్ బెల్' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్గా 'రాక్షసి' పేరుతో మరో చిత్రం రూపొందించడం జరిగింది.

పవన్ డిమాండ్స్ పై స్పందించిన చంద్రబాబు..!

శ్రీకాకుళంలో జిల్లాలో కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

చైతన్య టైటిల్ ఇదేనా....?

అక్కినేని నాగచైతన్య ఇప్పుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నే పెళ్లాడతా తరహా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది.

ఇంట్రస్టింగ్ టైటిల్ రిజిష్టర్ చేసిన కళ్యాణ్ రామ్..!

నందమూరి కళ్యాణ్ రామ్...యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.