పవన్‌కల్యాణ్ అడుగు పెట్టేది రేపే!!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటిస్తోన్న తొలి చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్ చిత్రం ‘పింక్’కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. నివేదా థామస్, అంజలి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాయర్ గా పవన్ చేస్తున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోవిడ్ కారణంగా హోల్డ్‌లో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల 'వకీల్‌సాబ్' షూటింగ్‌ను రీస్టార్ట్ చేశారు.
అయితే పవన్‌కల్యాణ్ మాత్రం ఈ షెడ్యూల్‌లో ఇంత వరకు పాల్గొనలేదు. కానీ ఆదివారం (నవంబర్ 1) నుండి సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడట. రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. డిసెంబర్ నెలలో సినిమా చిత్రీకరణు పూర్తి చేయాలనేది మేకర్స్ ప్లాన్. సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత వెంటనే అయ్యప్పనుమ్ కోశియనుమ్ రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో పవన్ వెంటవెంటనే నటించాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com