2018కి పవన్.. 2019కి చిరు

  • IndiaGlitz, [Saturday,October 28 2017]

2018 సంక్రాంతికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కొత్త చిత్రంతో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప‌వ‌న్‌కి న‌టుడిగా 25వ చిత్రం కావ‌డం విశేషం. కాగా, 2019 సంక్రాంతి బ‌రిలోకి ఆయ‌న సోద‌రుడు మెగాస్టార్ చిరంజీవి దిగే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సంక్రాంతికి త‌న రీఎంట్రీ మూవీ ఖైదీ నెం.150తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న చిరు.. త‌న త‌దుప‌రి చిత్ర‌మైన సైరా న‌ర‌సింహారెడ్డిని కూడా సంక్రాంతికే తీసుకువ‌చ్చే దిశ‌గా ఆలోచిస్తున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాని ఆయ‌న త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించనున్నారు. ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించ‌నుండ‌గా.. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ నిర్మాణం జ‌రుగుతోంద‌ని తెలిసింది.

More News

'పి ఎస్ వి గరుడ వేగ 126.18 ఎం' ఇంటరాక్షన్

డా.రాజశేఖర్. ఈయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్ వి గరుడవేగ 126.18ఎం'. పూజాకుమార్, శ్రద్ధాదాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఉషా మయూరి ద్వారా 'జూన్ 1:43' చిత్రం విడుదల

ఆదిత్య‌, రిచా హీరో హీరోయిన్లుగా ఆదిత్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'జూన్ 1:43'. శ్రవణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ లబిస్తోంది. ఇక నవంబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మేము పక్కా లోకల్ పోస్టర్ లాంచ్..

విక్రమ్ ఆర్ట్స్ సమర్పించు విఖ్యాత హరితవనం" మేము పక్కా లోకల్" దద్దరిల్లే జానపదం అనే క్యాప్షన్ తో 45 మంది బుల్లితెర  కళాకారులతో మొట్ట మొదటిసారిగా జానపద ఆట పాటల కార్యక్రమాన్ని జి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా విక్రమ్ ఆదిత్య రెడ్డి నిర్మాణంలో ఏర్పాటు చేస్తున్నారు.

సుమంత్ నూతన చిత్రం ప్రారంభం

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న  హీరో అక్కినేని సుమంత్. ఆయన  హీరోగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది.

నాగ శౌర్య కొత్త చిత్రం టైటిలిదే..

"ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌వైభోగం"," జ్యోఅచ్చుతానంద‌" లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ముఖ్యంగా ఫ్యామిలి ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాయించాడు నాగ‌శౌర్య.