బండ్ల, బోయపాటితో సినిమాపై పవన్ క్లారిటీ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల ముందు నుంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు దూరమవుతారని.. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి లాగా బ్యాక్ టూ మూవీస్ అని వెళ్లిపోతారని.. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతలు భారీగానే డబ్బులు ఆయనికిచ్చారని.. మే-23 ఫలితాల తర్వాత సినిమా ప్రారంభం అవుతుందని పెద్ద ఎత్తునవార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ఎన్నికల్లో ఘోరంగా జనసేన ఓటమి పాలవ్వడం.. పవన్ పోటీచేసిన రెండు స్థానాల్లోనూ గెలవకపోవడం ఇక జనసేనాని పని అయిపోయిందని.. పాలిటిక్స్ పవన్‌కు అచ్చిరావని.. సినిమాలే బెస్ట్ అని కొందరు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ మొదలయ్యాయ్!.
రెండ్రోజులుగా పెద్ద ఎత్తున పుకార్లు!
అయితే తాను సినిమాల్లోకి తిరిగొచ్చే ప్రసక్తే లేదని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ఫలితాల అనంతరం మీడియా మీట్లో పవన్ తేల్చిచెప్పేశారు. అయినప్పటికీ పవన్‌పై సినిమా తీస్తున్నారన్న రూమర్స్‌కు మాత్రం చెక్ పడలేదు. తాజాగా.. రెండ్రోజుల నుంచి.. పవన్‌తో సినిమా చేయడానికి బండ్లగణేష్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఈ సినిమాకు బోయపాటి శ్రీనును డైరెక్టర్‌గా ఎన్నుకున్నారని పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు పవన్‌కు సుమారు రూ. 50 నుంచి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ మాట్లాడరని.. సినిమా సుమారు 150 కోట్ల రూపాయిలతో తెరకెక్కిస్తారని వార్తలు వినిపించాయి. అయితే బండ్ల.. పవన్‌కు చాలా దగ్గరయిన వ్యక్తి కావడంతో ఈ పుకార్లు అక్షరాలా నిజమేనని అందరూ అనుకున్నారు.
ఎట్టకేలకు పవన్ క్లారిటీ..!
ఈ సినిమా వ్యవహారంపై బుధవారం నాడు ఓ మీడియా అధినేతతో పవన్ మాట్లాడి క్లారిటీ ఇచ్చేశారు. "మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ అవాస్తవం. నేను మళ్లీ సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదు. నా జీవితం ఇక ప్రజలకోసం అంకితం చేస్తున్నాను. మళ్లీ తిరిగి సినిమాల్లోకి వెళ్లను.. రాజకీయాల్లోనే ఉంటా.. ప్రజాసేవ చేస్తుంటాను" అని పవన్ క్లారిటీ ఇచ్చేశారు. సో.. ఇకనైనా పవన్ సినిమా పుకార్లు ఆపుతారో లేకుంటే యథావిథిగా కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments