జనసేనలోకి చిరు?.. క్లారిటీ ఇచ్చిన పవన్..

కాపులతోపాటు ఆర్థికంగా, సామాజికంగా అణగారిన అన్ని వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. 1930 నుంచే కాపు కులంలో విభజించు, పాలించు సిద్ధాంతం మొదలయ్యిందని, అది ఈ రోజుకీ కొనసాగుతోందన్నారు. కాపులకు రాజకీయ సాధికారిత వచ్చిన రోజు... మిగిలిన అన్ని వెనుకబడిన కులాలకు విముక్తి లభిస్తుందని చెప్పారు. బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య నేతృత్వంలోని బృందంతో సమావేశమయ్యారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ “కులం అనేది మనం ఎంచుకునేది కాదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు రెల్లి కులంవారి అవస్థలు చూసి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉండాలని రెల్లి కులాన్ని స్వీకరించాను. పొలిటికల్, సోషల్ ఫిలాసఫీని సంపూర్ణంగా అధ్యయనం చేసి రాజకీయాల్లోకి వచ్చాను. ఏదైనా మాట మాట్లాడితే కులం అంటగట్టేస్తారనే భయం నాకు లేదు. ప్రతి కులం ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకొన్నప్పుడు.. నేను పుట్టిన కులం నా దగ్గరకు వచ్చి సమస్యలను విన్నవించుకోవడం తప్పేమి కాదు. దానికి కులం అంటగడతారనే భయం అవసరం లేదు. నా మనసు, ఆలోచన ప్రజలకు తెలుసు. నేను అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెంది నవాడిని. ప్రతి కులంలో వెనకబాటు తనం గురించి మాట్లాడటానికి ఏ మాత్రం సంకోచించను

భారతదేశంలో కులాలను పక్కన పెట్టి రాజకీయం చేయలేము. కులాలను అర్ధం చేసుకొనే రాజకీయం చేయాలి. ఒక కులాన్ని భుజం మీద పెట్టుకొని ఊరేగే పరిస్థితి లేకుండా... ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించి వారిని అన్ని కులాలతో సమతుల్యం ఏర్పడేలా చేయాలి. కాపులు బలోపేతం అవ్వడం అంటే బీసీలను బలహీనులను చేయడం కాదు. వారికి రావాల్సిన హక్కులను తిరిగి తెచ్చుకోవడం. కాపుల వెనుకబాటు తనం, అసంతృప్తిని మనస్ఫూర్తిగా అర్ధం చేసుకున్నవాడిగా చెబుతున్నాను... బీసీలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను బలంగా ముందుకు తీసుకెళ్తాను” అని హామీ ఇచ్చారు. కాగా.. జనసేనలోకి చిరంజీవి వస్తున్నారా? అని విలేకర్లు ప్రశ్నించగా ‘అన్నయ్యగా చిరంజీవి గారు తమ్ముడు అభివృద్ధిని కోరుకుంటారు. అన్నయ్య గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పార్టీలోకి వస్తారా అనేది ఇప్పుడే చెప్పలేను’ అన్నారు.

More News

తల్లి పుట్టినరోజు సందర్భంగా సింగిల్ ఫ్రేమ్‌లోకి మెగా బ్రదర్స్..

తల్లి పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సింగిల్ ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు.

తల్లి పుట్టినరోజు సందర్భంగా చిరు ఎమోషనల్ పోస్ట్

అమ్మ అనే పదంలోనే కమ్మదనం ఉంది. అది సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ తల్లి అంటే ఉండే మమకారం అంతా ఇంతా కాదు.

ఢిల్లీ : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు

దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది.

‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ రిలీజ్ ఫిక్స్

తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం.. ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌..

ట్రెమెండస్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తోన్న మెగాస్టార్ 'ఆచార్య' టీజర్

'ఆచార్య దేవో భవ' అని మన అందరికీ తెలిసిందే.. కానీ 'ఆచార్య రక్షోభవ' అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.