సినిమాల్లోకి రీ ఎంట్రీపై తేల్చేసిన పవన్ కల్యాణ్..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ టాటా చెప్పేసి.. రాజకీయాల్లో రాణించాలని రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్.. జనసేన అంటూ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దూకాడు. అయితే సినిమాల్లో రాణించినంతగా రాజకీయాల్లో మాత్రం ఆయన రాణించకలేకపోయారు. అయినప్పటికీ ప్రజా సమస్యల కోసం.. పోరాడుతూ ఇటు కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నాడు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ కల్యాణ్.. రాజకీయాలకు రాం.. రాం.. చెప్పేసి మళ్లీ సినిమాల బాట పడతారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్వయంగా ఆయనే మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చుకున్నారు.
ఏదో దాస్తున్నట్లుగా ఉందే..!?
అయితే ఈ మధ్య మళ్లీ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్నారని.. ఇప్పటికే సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారని.. 20 రోజులు డేట్స్ కూడా ఇచ్చేశారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా పవన్ మరోసారి వివరణ ఇచ్చుకున్నారు. సినిమా ప్రతిపాదనలు కొన్ని చర్చల దశలో ఉన్నాయని.. అయినా ఒక్కోసారి నటుడి తాలూకు మానసిక స్థితిని దాటేశానేమో అనిపిస్తుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ ఇంటర్వ్యూలో రీ ఎంట్రీపై మరిన్ని విషయాలు అడగ్గా.. సినిమాల గురించి ఎందుకులెండి..? రాజకీయాల గురించి మాట్లాడుకుందామని ఒకింత దాటవేశారు. మొత్తానికి చూస్తే పవన్ ఏదో విషయాన్ని దాస్తున్నట్లుగా ఉంది.
రీ ఎంట్రీ ఇస్తున్నా కానీ...!
అవును సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను కానీ.. హీరోగా కాదని నిర్మాతగా వస్తున్నట్లు పవన్ చెప్పుకొచ్చాడు. నిర్మాతగా సినిమాలు తీయాలనే ఆలోచన ఉందని తన మనసులోని మాటను పవన్ బయటపెట్టాడు. అయితే రామ్‌చరణ్‌తో సినిమా సంగతేంటి..? ఏమైందనే ప్రశ్నకు.. తప్పకుండా చేస్తానని.. అయితే ఇంకా దర్శకుడు ఎవరు..? కథ ఇలాంటి ఇంకా సిద్ధం కావాల్సి ఉందని పవన్ తెలిపాడు. మొత్తానికి చూస్తే సినిమాల్లో హీరోగా కాకపోయినా.. టాలీవుడ్‌లో ఇలా నిర్మాతగా అయినా దర్శనమిస్తుంటారన్న మాట. సో ఏదైతేనేం సినిమాల్లోకి వచ్చినా.. రాజకీయాల్లో ఉన్నా ఫ్యాన్స్ ‘ప్రతిరోజూపండగే’ మరి. మరి ఆ రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో..? ఏంటో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com