జగన్‌ను.. ‘జగన్ రెడ్డి’ అనడంపై పవన్ వివరణ

  • IndiaGlitz, [Thursday,November 14 2019]

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని.. జగన్ రెడ్డి అంటున్నందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే. అంతేకాదు ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని.. జనసేనానికి ‘పవన్ నాయుడు’ అని కూడా కొత్తపేరు పెట్టారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన పవన్.. స్ట్రాంగ్ కౌంటర్స్, విమర్శల వర్షం కురిపించారు. గురువారం నాడు పార్టీ కార్యాలయంలో మాట్లాడిన పవన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘వ్యక్తిగతంగా వారు ఎంతగా రెచ్చగొట్టినా నేను వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడను. వ్యక్తిగత నిందల వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేయడమే మా సిద్ధాంతం. ఐదు నెలల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఇసుక వారోత్సవాలు చేయడం సిగ్గుచేటు. ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందన్న విషయంపైనే మేము దృష్టి పెడతాం. తెలుగు భాషను ప్రభుత్వం విస్మరిస్తోంది. మనది తెలుగు జాతి అన్న భావన పోతుంది. ఏపీలో తెలుగును విస్మరిస్తున్నారు. దీని వల్ల తీవ్ర పరిణామాలుంటాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు.

ఏమనాలో తీర్మానం చేసి చెప్పండి!

‘జనసేన నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు మనందరం ఒకసారి కడప జిల్లా పులివెందులలో పర్యటనకి వెళ్దాం. కేవలం రాజకీయ లబ్ది కోసం కాకుండా యురేనియం తవ్వకాలు వల్ల అక్కడ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అవి ప్రజల దృష్టికి తీసుకొచ్చి వాళ్లకి ఎలా న్యాయం చెయ్యాలో చూద్దాం. పవన్ నాయుడు అని వైసీపీ వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. తామంతా ఒక్కటే అనే భావన తెలంగాణలో ఉంది. ఆంధ్రాలో ఆ భావన లేదు.. కులాలవారీగా విడిపోయారు. తెలుగు భాషను చంపేస్తుంటే వైసీపీ మేధావులు ఏం చేస్తున్నారు..?. కుల మతాలకతీతంగా మా రాజకీయాలు ఉంటాయి. భాషా సంస్కృతులను కాపాడటం.. అవినీతిపైనే మా పోరాటం. జగన్ రెడ్డి అనేది ఆయన పేరు.. అందుకే నేను పిలుస్తున్నా.. పోనీ జగన్‌ను ఏమని పిలవాలో వైసీపీకి చెందిన 151 ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపండి అలాగే పిలుస్తాను. జగన్ గారిని జగన్ అనాలో, జగన్ రెడ్డి అనాలో , జగన్ మోహన్ రెడ్డి అనాలో, ఉత్తి జగన్ అనాలో, ఉత్తుత్తి జగన్ అనాలో తెలియజేయమని చెప్పండి. అలానే పిలుస్తాం. బొత్స గారిని కూడా ఏమని పిలవాలో చెప్పండి. జగన్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తారు. అందులో దాచుకోవాల్సిన అవసరం ఏముంది. ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో తెలియదు.. ఆ ప్రసాదం అమిత్ షాకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. తెలుగుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి రాగానే ఒకలా మాట్లాడుతున్నారు’ అని జగన్‌పై పవన్‌ విమర్శలు గుప్పించారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

ఏఎన్నార్ జాతీయ అవార్డ్స్: చిరు చేతుల మీదుగా ప్రదానం

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు పేరుతో ‘అక్కినేని అవార్డులు’ ఇవ్వడం మొద‌లెట్టిన విషయం తెలిసిందే. ఆయన మరణాంతరం ఆ ప‌రంప‌ర‌ని ఏఎన్నార్ కుమారుడు అక్కినేని నాగార్జున కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు.

నిన్న లతా మంగేష్కర్.. నేడు కృష్ణంరాజు..!

సినీ ఇండస్ట్రీ నుంచి వరుస షాకింగ్ న్యూస్‌లు వస్తున్నాయి. ఆ షాకింగ్ న్యూస్‌లతో వారి అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు!.

నవ్యాంధ్ర తొలి మహిళా సీఎస్‌గా నీలం సాహ్ని

నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. కాగా ఏపీలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం వ్యవహరించిన సంగతి తెలిసిందే.

రాహుల్.. జాగ్రత్త అంటూ సుప్రీం హెచ్చరిక

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ఒకింత సూచనలు, సలహాలు కూడా చేసింది. ‘మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి..

'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' ఫస్ట్‌ లుక్‌ విడుదల

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా