Pawan Kalyan:పిఠాపురం కేంద్రంగా పవన్ కల్యాణ్ ప్రచారం.. తొలి విడత షెడ్యూల్ విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేస్తుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ప్రచారం చేయనున్నారు. ఈమేరకు షెడ్యూల్ ఖారారైంది.
వారాహి వాహనం నుంచి పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి జనసేన నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. కాగా పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంది.
తొలి విడత ప్రచార షెడ్యూల్..
మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పిఠాపురం
ఏప్రిల్ 3 - తెనాలి
ఏప్రిల్ 4- నెల్లిమర్ల
ఏప్రిల్ 5- అనకాపల్లి
ఏప్రిల్ 6- యలమంచిలి
ఏప్రిల్ 7- పెందుర్తి
ఏప్రిల్ 8- కాకినాడ రూరల్
ఏప్రిల్ 9- పిఠాపురం
ఏప్రిల్ 10 - రాజోలు
ఏప్రిల్ 11- పి.గన్నవరం
ఏప్రిల్ 12- రాజానగరం
పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. అందుకే ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు.. తిరిగి ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. శనివారం సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు రామాలయం వద్ద వారాహి విజయభేరి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments