'అజ్ఞాతవాసి' కి ఇరానీ కేఫ్ ఫైట్ హైలైట్ అట
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం అజ్ఞాతవాసి`. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఇందులో కథానాయికలుగా నటించారు. ఖుష్బూ, రావు రమేష్, మురళీశర్మ, బొమన్ ఇరాని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అంతేకాకుండా.. ఈ సినిమాలో సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ పాత్ర ఏమై ఉంటుందోనని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పాత్రకు సంబంధించి ఒక గాసిప్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవన్, వెంకీపై ఒక ఫైట్ సీన్ ని త్రివిక్రమ్ తెరకెక్కించారన్నది ఆ గాసిప్పు సారాంశం. అది కూడా ఒక ఇరానీ కేఫ్ లో నాలుగు నిమిషాల పాటు సాగే ఫైట్ అని తెలిసింది. ఈ ఫైట్ సీన్ తో థియేటర్ మొత్తం షేక్ అవడం ఖాయమంటున్నారు. మరి ఆ ఫైట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెల 10 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments