పవన్ బర్త్ డే సందర్భంగా సర్‌ప్రైజ్ గిఫ్ట్ అదిరింది..
- IndiaGlitz, [Wednesday,September 02 2020]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది. ‘వకీల్ సాబ్’ మోహన్ పోస్టర్‌ను పవన్ బర్త్ డే కానుకగా చిత్రబృందం విడుదల చేసింది. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అంజలి నటిస్తున్నారు. హిందీలో విజయవంతమైన 'పింక్' తెలుగు రీమేక్ ‘వకీల్‌సాబ్’ సినిమాతో పవన్ వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ముందుగా చెప్పినట్టుగానే.. చెప్పిన సమయానికి చిత్రబృందం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. మహాత్ముని ఫోటోతో పాటు అంబేద్కర్ ఫోటోను మోషన్ పోస్టర్‌లో చూపించారు. క్రిమినల్ లా పుస్తకం ఒక చేతిలో.. మరో చేతిలో సాఫ్ట్ బాల్ పిక్ పట్టుకుని మోషన్ పోస్టర్‌లో పవన్ చాలా గంభీరంగా కనిపించారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ అలరిస్తుండగా.. మోషన్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తమన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానుంది. మొదట ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా ఐదు నెలలకు పైగా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ చిత్రంలో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా పవన్ బర్త్ డే సందర్భంగా ‘వకీల్ సాబ్’ అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయింది.