దటీస్ పవన్ కళ్యాణ్... (స్పెషల్ స్టొరీ)

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

హీరోల‌కు అభిమానులు ఉండ‌డం స‌హ‌జం. కానీ కొంత మందికి మాత్ర‌మే వీరాభిమానులు ఉంటారు. వారు త‌మ హీరో కోసం ఏం చేయ‌డానికైనా రెడీ అంటారు. అదే ఆ..హీరో ప‌వ‌ర్. అలాంటి ప‌వ‌ర్ ఉన్న హీరోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. సామాన్యుడు స్థాయి నుంచి అసామాన్యుడు గా ఎదిగిన చిరు బ్ర‌ద‌ర్ గా కెరీర్ ప్రారంభించి నేడు త‌నే ఓ ప‌వ‌ర్ లా ఎదిగిన‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2. అది అభిమానుల‌కు పండుగ రోజు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఇండియాగిల్జ్ట్ .కామ్ అందిస్తున్న స్పెష‌ల్ ఆర్టిక‌ల్

ద‌టీజ్ క‌ళ్యాణ్....

చిరు బ్ర‌ద‌ర్ గా అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి చిత్రంతో తెలుగుతెర‌కు ప‌రిచ‌య‌మయ్యారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. తొలిప్ర‌య‌త్నంలోనే త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు.ప‌వ‌న్ కు మార్ష‌ల్ ఆర్ట్స్ పై మ‌క్కువ ఎక్కువ‌. అందుక‌నే క‌రాటే, కుంగ్ ఫూ, కిక్ బాక్సింగ్ పై మ‌క్కువ‌తో సినిమాల్లో కూడా వాటిని చూపించేవారు. తొలి సినిమాలోనే ఆర్ష‌ల్ ఆర్ట్స్ తో కొన్ని ఫీట్స్ చేసి చూపించారు. చేతి వేళ్ల పై నుంచి వాహ‌నాలు వెళ్లే సీన్స్, బాడీపై బండ రాళ్లు ను ప‌గ‌ల‌గొట్టించే సీన్స్ రియ‌ల్ గా చేసి చూపించారు. అయితే ఇవి నిజంగా చేసినవి కావు. డూప్ అనే విమ‌ర్ళ‌లు వ‌స్తే...ఆ విమ‌ర్ళ‌ల్లో ఏమాత్రం నిజం లేదు అంటూ నిజంగానే ఆ ఫీట్స్ చేసాన‌ని ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో చేసి చూపించారు ద‌టీజ్ క‌ళ్యాణ్‌. అది చూసిన త‌ర్వాతే క‌ళ్యాణ్ కాస్త ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయ్యారు.

ట‌ర్నింగ్ పాయింట్...

అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి త‌ర్వాత‌ గోకులంలో సీత సినిమాతో అల‌రించాడు. ఆత‌ర్వాత భీమ‌నేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టించిన సుస్వాగ‌తం చిత్రంలో ఓ వైపు ప్రేమికుడుగా మ‌రో వైపు ప్రేమ మ‌త్తులో ప‌డి తండ్రిని కోల్పోయిన త‌న‌యుడు విభిన్న పాత్ర‌ను పోషించి శ‌భాష్ అనిపించుకున్నాడు. మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. సుస్వాగ‌తం త‌ర్వాత ప‌వ‌న్ న‌టించిన చిత్రం తొలిప్రేమ‌. నూత‌న ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కించిన తొలిప్రేమ ఓ సంచ‌ల‌నం. ఈ సినిమాలో ప‌వన్ పోషించిన బాలు పాత్ర‌ యువ‌త‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ప‌వ‌న్ ను యూత్ కు మ‌రింత ద‌గ్గ‌రి చేసింది. కెరీర్ కి ట‌ర్నింగ్ పాయింట్ లా.... ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది. ఆత‌ర్వాత త‌మ్ముడు, బ‌ద్రి, ఖుషీ...ఇలా వ‌రుస విజ‌యాల‌తో ప‌వ‌న్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

స‌రికొత్త అవ‌తారం...

ఖుషీ చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ న‌టించి తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం జానీ. ఈ చిత్రం ద్వారా ప‌వ‌న్ స్పాట్ డబ్బింగ్ అనే కొత్త ప్ర‌క్రియ స్టార్ట్ చేసార‌ని చెప్ప‌వ‌చ్చు. సీన్ తీసిన వెంట‌నే అక్కడిక్క‌డే డ‌బ్బింగ్ చెప్పించేవారు. అయితే అప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ చేసిన చిత్రాల‌కు పూర్తి భిన్నంగా జానీ ఉండ‌డం...ఈ సినిమాలో ప‌వ‌న్ నుంచి ఫ్యాన్స్ ఆశించే ఎంట‌ర్ టైన్మెంట్ త‌క్కువ‌గా ఉండ‌డంతో జానీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.

జానీ చిత్రంతో తెలుసుకున్న పాఠంతో ప‌వ‌న్ చేసిన చిత్రం గుడుంబా శంక‌ర్. ఈ సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఉండ‌డం వ‌ల‌న కాస్త ఫ‌ర‌వాలేద‌నిపించింది. తొలిప్రేమ ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ తో ప‌వ‌న్ చేసిన మ‌లి చిత్రం బాలు. ఈ చిత్రంలో ప‌వ‌న్ ల‌క్ష రూపాయ‌ల విలువ చేసే ఫ్యాంటు వేసుకోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌. అయితే ఈ సినిమా నాగార్జున అంతం సినిమాలా ఉండ‌డంతో చూసిన సినిమానే మ‌ళ్లీ చూస్తున్నామ‌ని ఆడియోన్స్ ఫీల‌య్యార‌నుకుంట బాలు అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు.ఆత‌ర్వాత బంగారం, అన్న‌వ‌రం చిత్రాల్లో న‌టించినా ఆశించిన‌ విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన తొలిచిత్రం జ‌ల్సా. ఈ చిత్రంలో సంజ‌య్ సాహు పాత్ర‌లో ప‌వ‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. జల్సా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. జ‌ల్సా త‌ర్వాత ప‌వ‌న్ చేసిన కొమ‌రంపులి, తీన్ మార్, పంజా...చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి.

ప‌వ‌ర్ స్టామినా...

ప‌వ‌న్ నుంచి స‌రైన సినిమా కోసం ఎదురుచూస్తున్న టైం వ‌చ్చిన సినిమా గ‌బ్బ‌ర్ సింగ్. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బండ్ల గ‌ణేష్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్ష‌కాభిమానులు కోరుకునే అన్ని అంశాలు గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో ఉండ‌డంతో...ఇది కాదా మేము కోరుకుంటుంది ప‌వ‌న్ నుంచి అంటూ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి స‌రికొత్త రికార్డులు స్రుష్టించింది. బ‌ద్రి త‌ర్వాత ప‌వ‌న్, పూరి క‌ల‌సి చేసిన చిత్రం కెమ‌రామెన్ గంగ‌తో రాంబాబు. ఈ చిత్రం కాస్త వివాదాస్ప‌ద‌మైనా ఫ‌ర‌వాలేద‌నిపించింది. మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాని అందించాల‌ని ప‌వ‌న్ చేసిన చిత్రం అత్తారింటికిదారేది. జ‌ల్సా త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ క‌ల‌సి చేసిన సినిమా ఇది. దీంతో సినిమా పై ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే అత్తారింటికి దారేది చిత్రం రిలీజ్ కు ముందే లీక్ అయింది. అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను ఒక‌టే టెన్ష‌న్. అత్తారింటికి దారేది రిజ‌ల్ట్ ఎలా ఉంటుంది..? అయితే సినిమా రిలీజ్ అయ్యింది. ఎవ‌రు ఊహించ‌ని విధంగా రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. ప‌వ‌ర్ స్టార్ స్టామినా ఏమిటో చూపించి ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌ల‌సి గోపాల గోపాల చిత్రంలో మోడ్ర‌న్ శ్రీశ్రీకృష్ణుడుగా న‌టించి మెప్పించారు. తాజాగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్ధార్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు.ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ప‌వర్ కోణం..

అన్న‌య్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు అన్న‌కు తోడుగా నీడ‌గా ఉంటూ ప‌వ‌న్ కూడా రాజ‌కీయ నాయ‌కుడుగా మారారు. కానీ ప్ర‌జారాజ్యం పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాడే కానీ ప‌వ‌న్ ఎక్క‌డ పోటీ చేయ‌లేదు. అయితే ప్ర‌జారాజ్యం పార్టీ ఎన్నిక‌ల్లో ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఆత‌ర్వాత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏ పార్టీని విమ‌ర్శించారో అదే కాంగ్రెస్ పార్టీలో అన్న‌య్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని విలీనం చేయ‌డం ప‌వ‌న్ ను బాగా బాధించింది.

ఈసారి ప‌వ‌నే రంగంలోకి దిగి రాజ‌కీయా పార్టీ ప్రారంభించారు. అధికారం కోసం కాదు...ప్ర‌శ్నించ‌డం కోసం అంటూ జ‌న‌సేన పార్టీ స్ధాపించారు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో పోటీ చేయ‌కుండా తెలుగుదేశం, బి.జె.పి పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చి ఆ పార్టీలు అధికారంలోకి రావ‌డానికి కార‌ణ‌మ‌య్యాడు ప‌వ‌న్. ఇలా....ఓ వైపు క‌థానాయ‌కుడుగా, మ‌రో వైపు రాజ‌కీయ నాయ‌కుడుగా రాణిస్తూ యూత్ లో తిరుగులేని క్రేజు ఏర్ప‌రుచుకున్న ప‌వ‌న్ మ‌రిన్ని పుట్టిన‌రోజులు జ‌రుపుకోవాల‌ని...మ‌రిన్ని మంచి చిత్రాల‌ను అల‌రించాల‌ని కోర‌కుంటూ బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేస్తుంది ఇండియాగ్లిట్జ్.

More News

ప‌వ‌న్ కోస‌మే సాయిధ‌ర‌మ్ తేజ‌తో సినిమాలా..?

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌రమ్ తేజ్ రేయ్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆత‌ర్వాత ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ హీరోగా పిల్లా నువ్వులేని జీవితం సినిమాని దిల్ రాజు నిర్మించారు.

లారెన్స్ హీరోయిన్ తో పవర్ స్టార్...

కాంచన, అధినాయకుడు, బలుపు వంటి చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను తన సోయగాలతో అలరించిన సొగసరి లక్ష్మీరాయ్ ప్రస్తుతం లక్కీఛాన్స్ కొట్టేసింది.

భారీ బడ్జెట్ కు ప్లాన్ చేస్తోన్న మంచు హీరో...

‘ఢీ, దూసుకెళ్తా, అనుక్షణం, రౌడీ’..వంటి డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు విష్ణు.

పోలెండ్ వెళుతున్నసూర్య...

తమిళ స్టార్ సూర్య హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘24’ సినిమా రూపొందుతోంది. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

క్యూ కడుతున్న మెగా ఫ్యామిలీ హీరోలు...

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోల ట్రెండ్ స్టార్ అయ్యి చాలా కాలమైంది. ఈ వరుసలో మెగా ఫ్యామిలీ హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తూ మిగిలిన హీరోలకంటే చాలా ముందంజలో ఉన్నారు.