ఆకతాయిల తిక్క కుదిర్చిన పవన్ 'బంగారం' పాప!

  • IndiaGlitz, [Saturday,June 12 2021]

హీరోయిన్ల శరీరాకృతి గురించి మాట్లాడడం నెటిజన్లకు అలవాటే. సెలెబ్రిటీలు కూడా తమపై వస్తున్న కామెంట్స్ కు పెద్దగా రియాక్ట్ అవ్వరు. కానీ హద్దులు దాటేలా కామెంట్స్ చేస్తే మాత్రం ఎవరైనా సహనం కోల్పోవడం సహజం. తాజాగా నటి సనూష విషయంలో ఇదే జరిగింది.

సనూష బాల నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం' చిత్రంలో సనూష.. మీరా చోప్రా చెల్లి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో బాల నటిగా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.

ఆ తర్వాత సనూష జీనియస్, రేణిగుంట లాంటి చిత్రాల్లో నటించింది. మలయాళంలో అయితే ఎన్నో చిత్రాల్లో బాల నటిగా నటించింది. ప్రస్తుతం సనూష దక్షణాది భాషల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది.

చాలా మంది ఆమె చూడచక్కని రూపానికి లైకులు, కామెంట్స్ రూపంలో తమ స్పందన తెలియజేస్తున్నారు. కానీ కొందరు ఆకతాయిలు మాత్రం సనూషపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె బరువు ఎక్కువగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సనూషకు చిరాకు తెప్పించాయి.

ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తనని బాడీ షేమింగ్ చేస్తున్న ఆకతాయిలకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది సనూష. ఒకరిపై కామెంట్ చేసే ముందు మీరెలా ఉన్నారో చూసుకోండి. మీరు కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. రెండు వేళ్ళు ఇతరులపై చూపిస్తే మనవైపు మూడు వేళ్ళు చూపిస్తారు.ఇది గుర్తుంచుకోండి. మీ పని మీరు చేసుకోండి. శరీరకంగానే కాదు మానసికంగాకూడా ఎదగండి అని వారికి బుద్ధి చెప్పింది.

More News

సిక్స్త్ సెన్స్... నాలుగో సీజన్ షురూ !!

ఎంటర్ టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలిసిన "సిక్స్త్ సెన్స్" సరికొత్తగా నాలుగో సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది.

'మన్మథుడు 2' డైరెక్టర్ కు మరో గోల్డెన్ ఛాన్స్?

నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లాడు రాహల్ రవీంద్రన్. 'చిలసౌ' చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆదిత్య 369 సీక్వెల్.. మోక్షజ్ఞపై బాలయ్య చేసింది సీరియస్ కామెంటా ?

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయే చిత్రం 'ఆదిత్య 369'.

జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య.. రామారావు గారు అయ్యారు కదా అని.. 

తన పుట్టినరోజు సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఎండ X వాన: గత 121 ఏళ్ల చరిత్రలో.. మే నెలలో ఊహించని రికార్డులు

ప్రస్తుతం కోవిడ్ ప్రభావాన్ని పక్కన పెట్టి మాట్లాడుకుంటే.. వేసవి వస్తుందంటే చిన్న పిల్లలకు తెలియని ఆనందం, ఉత్సాహం ఉంటాయి