గీతాంజలి మృతిపై బాలయ్య, పవన్ స్పందన

  • IndiaGlitz, [Thursday,October 31 2019]

టాలీవుడ్‌ సీనియర్ నటి గీతాంజలి గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో పొందుతూ మృతిచెందారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటీనటులు ఆమెతో తమకున్న అనుబంధాన్ని మీడియా, సోషల్ మీడియా ముఖంగా స్పందిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు.

గీతాంజలి మృతి టాలీవుడ్‌కు తీరని లోటు!

‘గీతాంజలి గారు చనిపోయారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమెకు మా కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. నా తండ్రి ఎన్టీఆర్ అంటే గీతాంజలి గారు ఎంతో అభిమానం చూపేవారు. ఆమె ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన సీతారామ కల్యాణం చిత్రంలో గీతాంజలి సీత పాత్ర పోషించారు. నటనలో ఆమె ఎన్టీఆర్‌నే స్ఫూర్తిగా తీసుకునేవారు. ఇప్పుడామె అందరినీ వదిలి వెళ్లిపోవడం అత్యంత బాధాకరం’ అని సోషల్ మీడియాలో బాలయ్య రాసుకొచ్చారు.

శ్రీనివాస థియేటర్స్‌కు వెళ్లేవాళ్లం!

‘తెలుగు సినీ రంగంలో ఉన్న సీనియర్లలో గీతాంజలి ఒకరు.. ఆమె మరణం బాధాకరం. గీతాంజలి పేరు చెబితే 'సీతారామ కల్యాణం' చిత్రంలోని 'శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి' అనే పాటలోని సీతాదేవి గుర్తుకు వస్తుంది. తెలుగులోనే కాకుండా ఆమె అనేక భాషల్లో నటించి తనదైన శైలిలో వినోదం అందించారు. అప్పట్లో మేం చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి కుటుంబానికి చెందిన శ్రీనివాస థియేటర్స్‌కు వెళ్లేవారంమ.. అక్కడ గీతాంజలి కుటుంబ సభ్యులను కలుస్తుండేవాళ్లం. ఆ అనుబంధం హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, ఆమె కుటుంబ సభ్యులకు తన తరఫున, జనసైనికుల తరఫున ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను’ అని గీతాంజలితో తమ అనుబంధాన్ని పవన్ వెల్లడించారు.

More News

సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు - నిర్మాత విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’.

ప్ర‌కాష్‌రాజ్‌ను సినిమాల నుండి నిషేధించాలంటూ ఫిర్యాదు

బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌ను సినిమాల నుండి బ‌హిష్క‌రించాల‌ని క‌ర్ణాట‌క చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లిలో అఖిల భార‌త హిందూ మ‌హా స‌భ వేదిక ఫిర్యాదు చేసింది.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న'నిన్నే పెళ్లాడతా'

ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై అమన్(రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్)  ,సిద్ధిక హీరోహీరోయిన్లుగా వైకుంఠ బోను దర్సకత్వంలో  

గీతాంజలి మృతి ‘మా’కు తీరని లోటు!

టాలీవుడ్‌ సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో

టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు.