పిక్ టాక్: భీమ్ల నాయక్ గా పవన్ కళ్యాణ్.. ప్రీ లుక్ తో రచ్చ షురూ!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్.యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి: ఉప్పెన బ్యూటీ సెన్సేషనల్ డీల్.. జీ నెట్వర్క్ నుంచి భారీ రెమ్యునరేషన్!
షూటింగ్ తిరిగి ప్రారంభమైన సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ పాత్ర పేరు రివీల్ చేస్తూ ప్రీ లుక్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ స్టైల్ తో ప్రీ లుక్ అదుర్స్ అనిపిస్తోంది. పోలీస్ గెటప్ లో పవన్ లుక్ అభిమానులకు మంచి కిక్కిచ్చేలా ఉంది.
ప్రీ లుక్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ జాతర షురూ చేశారు. ట్రెండింగ్ తో మోతెక్కిస్తున్నారు. ఇంతకీ ఈ చిత్రంలో పవన్ పాత్ర పేరు ఏంటంటే.. భీమ్ల నాయక్. పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో గబ్బర్ సింగ్ చిత్రంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అంతకు మించేలా భీమ్ల నాయక్ పాత్ర ఉండాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.
ఒరిజినల్ వర్షన్ లో బిజు మీనన్ చేసిన పాత్రని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈ నెల 12నే ఈ చిత్ర షూటింగ్ పునః ప్రారంభం కావాల్సింది. కానీ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ తప్పుకోవడం స్థానంలో రవి కె చంద్రన్ రావడంతో ఆలస్యం అయింది. మొత్తానికి ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక రానా పాత్ర గురించి అప్డేట్ రావాల్సి ఉంది. పవన్ కి జోడిగా నిత్యామీనన్.. రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.
#BheemlaNayak is back on duty ????@SitharaEnts #ProductionNo12 shoot resumes today with all the safety precautions!
— Sithara Entertainments (@SitharaEnts) July 26, 2021
Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @vamsi84 @NavinNooli pic.twitter.com/JA6EPqqJFT
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com