రవితేజ లెక్కే పవన్క్కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
సర్దార్ గబ్బర్ సింగ్.. నిర్మాణంలో ఉండగానే ఈ సినిమా ఎంతో బజ్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా కావడమే ఈ రేంజ్ బజ్ కి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి తోడు పవర్ వంటి హిట్ ఫిల్మ్ తీసిన బాబీ దర్శకుడు కావడం మరో కారణం. ఇదిలా ఉంటే.. రవితేజతో హిట్ కొట్టిన బాబీ.. పవన్‌తోనూ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తాడా? అంటే దానికి 100 పర్సంట్ అన్నది సమాధానంగా వినిపిస్తోంది.
అదెలాగంటే.. రవితేజతో సినిమా తీసిన దర్శకులు కొందరు వెనువెంటనే పవన్‌తో సినిమాలు తీసిన వైనం ఉంది. వారిలో రవితేజతో ఫ్లాప్ సినిమా తీసి.. పవన్‌తోనూ పనిచేశాక అదే ఫలితం పొందిన వారు ఉన్నారు. అలాగే రవితేజతో హిట్ సినిమా తీసి.. వెంటనే పవన్‌తో సినిమా చేసి హిట్ కొట్టిన వారున్నారు.
దొంగోడు వంటి ఫ్లాప్ తరువాత భీమినేని అన్నవరం తోనూ అలాంటి ఫలితం పొందితే.. దేవుడు చేసిన మనుషులు వంటి పరాజయం తరువాత పూరీ జగన్నాథ్ తీసిన కెమెరామెన్ గంగతో రాంబాబుతోనూ అదే రిపీట్ చేశాడు. రవితేజతో మిరపకాయ్ రూపంలో హిట్ కొట్టిన హరీష్.. పవన్‌తో గబ్బర్ సింగ్ రూపంలోనూ హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో పవర్‌తో హిట్ కొట్టిన బాబీ.. సర్దార్తోనూ రిపీట్ చేస్తాడన్న సెంటిమెంట్ ఫిల్మ్‌నగర్ వర్గాలలో వినిపిస్తోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com