‘‘ నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలికి వస్తే కష్టం’’ : భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసిందిగా
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. అభిమానులను ఆకట్టుకునేలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. 2 నిమిషాల 37 సెకండ్ల నిడివి వున్న ఈ ట్రైలర్ అన్ని రకాల అంచనాలను అందుకునేలాగా వుంది.
'ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావ్' అంటూ రానా వాయిస్ తో ట్రైలర్ మొదలవుతుంది. డానీ.. డానియల్ శేఖర్ అంటూ రానా ఎంట్రీ ఇస్తాడు. భీమ్లా నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటూ పవన్ తనని తాను పరిచయం చేసుకుంటాడు. పవన్ , రానా ఎదురైనప్పుడు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. 'ఏం నాయక్.. నువ్వు పేల్చినప్పుడు వాడు లోపల లేడా.. చూసుకోవాలి కదా' అంటూ నిత్యామీనన్ అంటే ‘‘నేను ఇవతల ఉంటేనే చట్టం.. అవతలికి వస్తే కష్టం.. వాడికి' అంటూ పవన్ బదులిచ్చే తీరు త్రివిక్రమ్ మార్క్ చూపెడుతుంది.
ఇదిలా ఉండగా.. ఈరోజు హైదరాబాద్ యూసఫ్‌గూడ గ్రౌండ్స్ లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి వుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
భీమ్లా నాయక్’’ను తొలుత సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే దీనికి ముందు వెనుకా రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానుండటంతో చిత్ర పరిశ్రమ, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25కి భీమ్లా నాయక్ వాయిదా పడింది.
ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తుండగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments