వార్‌కు సిద్ధమవుతున్న పవన్, ప్రకాష్‌రాజ్‌..

  • IndiaGlitz, [Tuesday,December 01 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌లు వార్‌కు సిద్ధం కాబోతున్నారు. అయితే రియల్‌గా కాదులెండి.. రీల్ పరమైన వార్‌కు సిద్ధమవుతున్నారు. పవన్ హీరోగా 'వకీల్‌ సాబ్‌' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘వకీల్ సాబ్’లో పవన్ లాయర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో లాయర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. డిసెంబర్‌లో జరగబోయే షెడ్యూల్‌లో కోర్టు సీన్‌ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

ఈ కోర్టు సీన్‌లో పవన్, ప్రకాష్ రాజ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వార్ జరగనున్నట్టు తెలుస్తోంది. పవన్ న్యాయం వైపు నిలబడగా.. ప్రకాష్ రాజ్ అన్యాయం వైపు నిలిచి వాదనలు వినిపించనున్నట్టు తెలుస్తోంది. సినిమా విషయాన్ని పక్కనబెడితే ఇటీవల పవన్, ప్రకాష్‌రాజ్‌ల మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాల విషయమై వీరిద్దరి కలయిక ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయాలను సినిమాతో ముడిపెట్టకుండా ఎవరి పని వారు చూసుకుంటారా? లేదంటే పరిస్థితి వేరేలా ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను ప్రకాష్‌ రాజ్‌.. 'ఊసరవెల్లి' అంటూ సంభోదించిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ అయితే ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు కానీ ఆ తర్వాత మెగా బ్రదర్‌ నాగబాబు.. ప్రకాష్‌ రాజ్‌కు స్ట్రాంగ్‌ రిప్లయ్ ఇస్తూ ఓ లేఖను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. నాగబాబు లెటర్‌కు ఆ భాష తనకు రాదంటూ ప్రకాష్‌ రాజ్‌ కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్‌ వేశారు. ఇదిలా నడుస్తుండగానే పవన్, ప్రకాష్‌రాజ్‌లు కలిసి నటించే సీన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్రబృందం సిద్ధమవడం వంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

More News

జేసీకి భారీ షాక్.. రూ.100 కోట్ల జరిమానా విధించిన మైనింగ్ అధికారులు

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ అధికారులు ఊహించని షాక్‌ ఇచ్చారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో

తొలిసారిగా.. అభిని నామినేట్ చేసిన మోనాల్, హారిక..

నిన్న హోస్ట్ నాగ్ ముందు చేసిన కాన్వర్సేషన్‌ని తరువాత కూడా అవినాష్ కంటిన్యూ చేశాడు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) నేడు కన్నుమూశారు.

ప్రారంభమైన ఎన్నికల పోలింగ్..

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

థియేటర్లు తెరిచేందుకు చర్యలు చేపట్టిన ప్రొడ్యూసర్స్ గిల్డ్..

కరోనా మహమ్మారి మూలంగా విపరీతంగా నష్టపోయిన పరిశ్రమలో చిత్ర పరిశ్రమ ఒకటి. ఇప్పటికీ థియేటర్లు ప్రారంభానికి నోచుకోలేదు.