close
Choose your channels

పవన్‌, నాగబాబు మీకు దమ్ముంటే అడ్డుకోండి!

Thursday, March 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్‌, నాగబాబు మీకు దమ్ముంటే అడ్డుకోండి!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన సోదరుడు నాగబాబుకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నానని.. దమ్ముంటే పవన్ కల్యాణ్, నాగబాబు తన విజయాన్ని అడ్డుకోవాలని బహిరంగ సవాల్ విసిరారు. పవన్‌కు డ్యాన్స్ చేయడం అస్సలే రాదని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. వేదికపై పవన్ కల్యాణ్ స్టెప్పులేసి పెద్ద హడావుడే చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పోలిస్తే పవన్‌కు డ్యాన్స్ చేయడం రాదని అన్నారు.

అన్నీ తుప్పుపట్టాయ్!

"పవన్, జగన్, చంద్రబాబులకు ఓటు వేయరాదు. వారంతా సీట్లను అమ్ముకుని.. రాష్ట్రాన్ని దోచుకుంటారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టిస్తాను. హెలికాప్టర్‌కు, ఫ్యాన్‌కు తేడా కూడా తెలియని జగన్ సీఎం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్నాను. అంతేకాదు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతున్నాను. నేను ఎమ్మెల్యేగా కూడా పోటి చేయనుండటంతో అందిరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తుప్పుపట్టిన ఫ్యాన్, తుప్పుపట్టిన సైకిల్, పగిలిపోయే గ్లాసు గుర్తులకు ఓటు వేయవద్దు. అధికారంలోకి వస్తే ఏడాదిలో ఏపీని అమెరికా చేస్తాను. మా పార్టీలో అన్ని కులాలకు టికెట్లు ఇస్తున్నాను" అని ఆయన చంద్రబాబు, జగన్, పవన్‌‌లపై పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment