నా ఆరోగ్యం కుదుటపడుతోంది : పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నుంచి తన ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యుల సలహాలు పాటిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. వీలైనంత త్వరగా కోలుకుని అభిమానుల ముందుకు వస్తానన్నారు. తాను కరోనా బారినపడ్డానని తెలిసినప్పటి నుంచి తన యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ తాను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ని కావాలని ప్రతి ఒక్కరూ ఆశించారన్నారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారన్నారు. సందేశాలు పంపారని.. వారందరికీ పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, అభిమానులు తాను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో, ప్రార్థన మందిరాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, యాగాలు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ వెల్లడించారు. అభిమానుల గుండెల్లో తనకు స్థానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో తన భావోద్వేగాన్ని వెల్లడించలేకున్నానన్నారు. ఎప్పటికీ మీరంతా తన కుటుంబ సభ్యులేనన్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వచ్చి.. మీతో పాటే ప్రజల కోసం నిలబడతానని పవన్ వెల్లడించారు.
మరణాలు తగ్గే విధంగా చూడటం ప్రభుత్వ బాధ్యత
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు ఏడు వేలకు పైగా కేసులు, తెలంగాణలో నాలుగు వేలకు పైగా కేసులు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం నమోదవుతున్నాయి అనీ, అంతకు కొన్ని రెట్ల కేసులు ఉన్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments