పవన్, అకీరా ఇద్దరూ కలసి.. ఫోటోస్ వైరల్

  • IndiaGlitz, [Monday,May 31 2021]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. వైద్యుల పర్యవేక్షణలో పవన్ కోలుకున్నారు. కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా ఇప్పుడిప్పుడే పవన్ తన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటోస్ బయటకు వచ్చాయి. ఈ ఫోటోస్ లో పవన్ తనయుడు అకీరా కూడా ఉన్నాడు. ఈ ఫోటోస్ లో పవన్ ఎప్పటిలాగే క్యాజువల్ గా కనిపిస్తుండగా.. అకిరా మాత్రం స్పెషల్ గా కనిపిస్తున్నాడు. అకిరా హైట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇదీ చదవండి: దివి స్టన్నింగ్ హాట్: ఎదపై టాటూ.. రేర్ రికార్డ్ కొట్టేసింది

తన హైట్, లుక్ తో అకిరా అభిమానులని అట్రాక్ట్ చేస్తున్నాడు. అకిరా వయసు తక్కువే అయినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం అతడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటూ తొందర పడుతున్నారు. మరి అభిమానుల నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పన్ కోషియం రీమేక్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ ప్రభావం తగ్గాక తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది.

More News

నేటి నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ మెట్రో పరుగులు

లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి జూన్‌ 9 వరకు పొడిగించింది.

ప్రేయసి వెంటిలేటర్‌పై ఉండగానే తాళి కట్టాడు.. కానీ..

కరోనా మహమ్మారి తొలి వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత దారుణంగా ఉంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కనీసం కుటుంబ సభ్యులంతా కలిసి కరోనా మృతులకు గౌరవప్రదంగా

ఆనందయ్యను ఎందుకు ఇంతలా వేధిస్తున్నారు?

ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టు ప్రశ్నించింది.

దివి స్టన్నింగ్ హాట్: ఎదపై టాటూ.. రేర్ రికార్డ్ కొట్టేసింది

యంగ్ బ్యూటీ దివి వాద్త్యా పేరు మారుమోగిపోతోంది. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో పాపులారిటీ పెంచుకుంటోంది. ఇప్పుడిప్పుడే దివికి అవకాశాలు వస్తున్నాయి.

కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లో పుట్టిందే..!

కరోనా కచ్చితంగా ల్యాబ్‌లో తయారుచేసిన కృత్రిమ వైరసా? అంటే అవుననే అంటున్నారు యూరోపియన్‌ శాస్త్రవేత్తలు. వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా ఉద్భవించిందంటూ ఇప్పటి వరకూ ఎన్నో విమర్శలు వచ్చాయి.