`అజ్ఞాతవాసి` ఆడియో ఎప్పుడంటే...

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

ప‌వ‌ర్‌స్టార్ పవ‌న్‌క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'అజ్ఞాత‌వాసి'. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించిన పాట‌ల్లో బ‌య‌ట‌కొచ్చి చూస్తే..అనే సాంగ్ రిలీజై ట్రెండ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు అన్ని సాంగ్స్‌ను డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.