'సైరా', 'కాటమరాయుడు' గురించి పవన్ ఏమన్నారంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే తమ్ముడు 'కాటమరాయుడు' ఆల్రెడీ చూసేశాం.. ఇక మిగిలింది చిరంజీవి 'సైరా'నే కదా అని అనుకుంటున్నారా..? ఇది మీరు అనుకుంటున్నట్లుగా ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు అస్సలు కానేకాదండోయ్. సైరా 'నరసింహారెడ్డి', 'కాటమరాయుడు' అంటే రియల్ లైఫ్‌లో హీరోలు. వీరిద్దరూ రాయలసీమలో ఒకప్పుడు కింగ్‌లు. ఒక్కమాటలో చెప్పాలంటే రాయలసీమ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉందంటే ఆ ఇద్దరే మొదటి కారణమని చెప్పుకోక తప్పదు. ఆ రియల్ హీరోల గురించి ఎంత చెప్పినా.. ఏం చెప్పినా తక్కువే.. అందుకే చరిత్రలో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి మరి. తాజాగా జనసేనాధిపతి పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సైరా, కాటమరాయుడును గుర్తుకు తెచ్చుకున్నారు. అసలు ఆయన ఆ కింగ్‌ల గురించి ఏం చెప్పారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ మాటల్లోనే...
"సైరా నర్సింహారెడ్డి బ్రిటిష్ కబంద హస్తాల నుంచి దేశాన్ని విడిపించారు. రెడ్డి అంటేనే రక్షకుడని అర్థం. కులాలు తెలియని ఎంతో మంది మహానుభావులు దేశాన్ని అభివృద్ధి చేశారు. కులాలు తెలియని రాజకీయాలు కావాలి. రాయలసీమలో గొర్రెలు కాపరి కాటమరాయుడు. నెల్లూరు రాజుపై కాటమరాయుడు ఎదురుతిరిగి మధం అనిచాడు. అలాంటి కాటమరాయుడు పుట్టింది ఈ కర్నూలు జిల్లాలోనే" అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
మీరు జేజేలు కొట్టడం కాదు.. ఓటెవరికేస్తారో తేల్చుకోండి!
"కర్నూలు జిల్లా ప్రజలు అన్యాయానికి ఎదురుతిరుగుతారు. మార్పు రావాలంటే నాకు జేజేలు కొట్టాల్సిన అవసరం లేదు. మార్పు కోసమే జనసేన స్థాపించాను. సీఎం అంటూ మీరు వేసే కేకలు మార్పుకు చిహ్నం. రౌడీయిజాన్ని, రాజకీయాలను తరిమేద్దాం. యువత మార్పు కోరుకుంటోంది. నాదగ్గర డబ్బులేదు.. అండగా న్యూస్ ఛానెల్స్ లేవు. జనసైనికులే నా ఛానల్స్.. వాళ్లే నా పేపర్. మీడియాను నమ్మి నేను రాజకీయాల్లోకి రాలేదు. మార్పుకు కాంచీ రామయ్యకు నాకు ఆదర్శం. యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే నేను మార్పు కోసం వచ్చాను. మీ మొదటి ఓటు ఎవరికి వేస్తారో తేల్చుకోండి. ఓటమికి భయం లేని వాడికే విజయం తథ్యం" అని పవన్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout