అప్పుడు అడగలేదు...ఇప్పుడు రాజకీయం ఏం తెలుసు అంటున్నారు - పవన్..!

  • IndiaGlitz, [Friday,January 27 2017]

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్...ప్ర‌త్యేక హోదా కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు పిలుపు ఇవ్వ‌టం...నిన్న వైజాగ్ ఆర్కే బీచ్ ద‌గ్గ‌ర నిర‌స‌న తెలియ‌చేసేందుకు వెళ్లిన యువ‌త‌ను ప్ర‌భుత్వం అడ్డుకోవ‌డం తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు జ‌న‌సేన పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో మాట్లాడుతూ....ప‌దేళ్లు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభ‌జించింది. ఎన్నిక‌ల్లో నేను బి.జె.పి, టి.డి.పికి మ‌ద్దతు ప్ర‌క‌టించాను.
అప్పుడు ఎవ‌రూ కూడా నీకు రాజ‌కీయం ఏం తెలుసు అని అడ‌గ‌లేదు. ఇప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తుంటే నీకు రాజకీయం ఏం తెలుసు అని ప్ర‌శ్నిస్తున్నారు దీనికంటే అవ‌కాశ‌వాదం ఎక్క‌డైనా ఉంటుందా అని ప్ర‌శ్నించారు. జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం కేవ‌లం సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మం కాదు బిజెపీ పై కోపంతో త‌మిళ యువ‌త చేప‌ట్టిన ఉద్య‌మం. ప్ర‌త్యేక హోదా ప‌దేళ్లు కావాల‌ని పార్ల‌మెంట్ లో మాట్లాడిన వెంక‌య్య‌నాయుడు అధికారం రాగానే అదేమీ సంజీవని కాదు అని వ్యాఖ్యానించ‌డం దారుణం. న‌మ్ముకున్న సిద్దాంతం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. యువ‌త శాంతియుతంగా ఆందోళ‌న చేసుకుంటే ఎందుకు అడ్డుకున్నారు. అన‌వ‌స‌రంగా యువ‌త‌ను రెచ్చ‌గొట్ట‌డం క‌రెక్ట్ కాదు అన్నారు.