అయోధ్య తీర్పుపై జనసేనాని స్పందన ఇదీ...
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే. వివాదాస్పద స్థలం హిందువులకు.. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం అంటూ దశాబ్దాలుగా నెలకొన్న ఈ వివాదానికి ఒకే ఒక్క గంటలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చేసింది. ఈ చరిత్రాత్మక తీర్పు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్విట్టర్, మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ తీర్పుపై పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
పవన్ ట్వీట్ సారాంశం ఇదీ..
‘సాంత్వన కలిగించేలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారత న్యాయవ్యవస్థ స్వచ్ఛమైన విజ్ఞతకు దర్పణం పడుతోంది. ధర్మాన్ని పరిరక్షించేలా తీర్పు ఇచ్చినందుకు సుప్రీం కోర్టుకు భారతీయులుగా తామందరం హృదయపూర్వక సమ్మతి తెలుపుతున్నాము..’ అని పవన్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు చివర్లో ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాన్ని జోడించారు. కాగా పవన్ ట్వీట్‌కు మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కామెంట్స్, షేర్‌లు చేస్తున్నారు. కాగా తీర్పు అనంతరమే భారత ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించిన విషయం విదితమే.
The healing and historical judgement by Supreme Court on ‘Ram Janmaboomhi ‘ reflects the distilled wisdom of Indian Judiciary. We people of ‘Bharath’ wholeheartedly acknowledge the ?????? Supreme Court for upholding ‘Dharma.’
— Pawan Kalyan (@PawanKalyan) November 9, 2019
Bharath Matha ki Jai!!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments