ప‌వ‌న్ 30 కూడా రీమేక్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • IndiaGlitz, [Wednesday,August 19 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజకీయాల్లో కొన‌సాగుతూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం యాక్టివ్ రాజ‌కీయాల్లో ఉంటూనే త‌క్కువ స‌మ‌యాల‌ను సినిమాల‌కు కేటాయిస్తూ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు ప‌వ‌ర్‌స్టార్‌. ఇప్ప‌టికే ‘వ‌కీల్‌సాబ్’ సెట్స్‌పై ఉంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది. ఈ రెండు కాకుండా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇది కాకుండా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నాలుగు కాకుండా గ‌త కొన్నిరోజులుగా వార్త‌ల్లో న‌లుగుతున్న మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్’ రీమేక్‌లోనూ ప‌వ‌న్ న‌టిస్తార‌ని టాక్ వినిపిస్తోంది.

‘తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ మ‌ల‌యాళ రీమేక్ తెర‌కెక్కిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేమ‌క‌థా చిత్రాల‌నే తెర‌కెక్కించిన వెంకీ అట్లూరి అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ వంటి డ్రామా మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌చ్చేలా మార్పులు చేర్పులు చేసి ఎలా తెర‌కెక్కిస్తాడోన‌ని కూడా అనుకుంటున్నారంద‌రూ. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ప‌వ‌న్‌తో పాటు న‌టించ‌బోయే మ‌రో హీరో ఎవ‌ర‌నే దానిపై కూడా ఆస‌క్తినెల‌కొంది.