పవన్ 29 ఖరారైందా?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా పింక్ రీమేక్ వకీల్‌సాబ్ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తి కాగానే క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తారు. అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పారు. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా.. తదుపరి పవన్ సినిమాలపై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా తాజా సమాచారం మేరకు ఓ కొత్త చిత్రంలో నటించడానికి పవన్ ఓకే చెప్పారని వార్త షికార్లు చేస్తున్నాయి. వివరాల మేరకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్‌కు సన్నిహితుడైన నిర్మాత, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమా చేయనున్నారట. అయితే పవన్ ఇది వరకు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాతే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ గ్యాప్‌లో అక్కినేని అఖిల్‌తో సురేందర్ రెడ్డి సినిమా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సైరా నరసింహారెడ్డి తర్వాత సురేందర్ రెడ్డి ఏ సినిమా చేస్తారనే దానిపై త్వరలోనే ఓక్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments