ప్రారంభమైన ప‌వ‌న్ కళ్యాణ్ మరో కొత్త చిత్రం

  • IndiaGlitz, [Wednesday,January 29 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీసెంట్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ చిత్రం 'పింక్‌' సినిమా తెలుగు రీమేక్‌లో ప‌వ‌న్ న‌టిస్తున్నారు. అయితే అధికారికంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా చేస్తున్నార‌ని వార్త‌లు రాన‌ప్ప‌టికీ ఆయ‌న షూటింగ్ మాత్రం సైలెంట్‌గా పూర్తి చేసేస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ మ‌రో సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. దీనికి సంబంధించి కూడా అధికారిక స‌మాచారం మాత్రం వెలువ‌డ‌లేదు. కానీ అన‌ధికారికంగా ప‌వ‌న్ 27 ప్రారంభ‌మైంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాను ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు.

హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశార‌ట‌. ఫిబ్ర‌వ‌రి 4 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ట‌. తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో ప‌వ‌న్ పాల్గొన‌డం లేదు. నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం అయ్యే లోపు ప‌వ‌న్ 'పింక్' రీమేక్‌లో త‌న పార్ట్‌ను పూర్తి చేసేసుకుంటాడ‌ట‌. త‌ర్వాత క్రిష్ అండ్ టీమ్‌తో జాయిన్ అవుతాడ‌ట‌. పీరియాడిక‌ల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప‌వ‌న్ రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని వార్తలు విన‌ప‌డుతున్నాయి.

More News

మోదీ తర్వాత రజనీకాంతే

ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంతే... అవునా ఏ విషయంలో అనే సందేహం కలుగుతోంది కదూ..

'క్రాక్' కాపీ క‌థ‌నా?

ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `క్రాక్‌`. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సత్యం చిత్రం మొదటి షెడ్యూల్ తలకొన అడవుల్లో పూర్తి!

శ్రీమాతా క్రియేషన్స్ బ్యానర్ పై కె.మహాంతేష్ నిర్మాతగా అశోక్ కడబ దర్శకత్వంలో సంతోష్ బాలరాజు హీరోగా షియాజి షిండే, సుమన్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం సత్యం.

20 నిమిషాల కోసం దాదాపూ రూ.8 కోట్లా?

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ గ‌త ఏడాది ద‌బాంగ్ 3 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ సినిమాను ప్ర‌భుదేవా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మూడోసారి ప్ర‌భుదేవాద‌ర్శ‌క‌త్వంలోనే స‌ల్మాన్‌ఖాన్ రాధే

వివేకా హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్.. పేర్లు బయటికొచ్చాయ్!!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలువుర్ని పోలీసులు, కోర్టులు విచారించిన