పవన్ 25..మూడు హ్యాట్రిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో జల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాల తరువాత మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనిరుద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విజయం సాధిస్తే.. మూడు రకాల హ్యాట్రిక్ దక్కుతాయి. అదెలాగంటే.. పవన్, త్రివిక్రమ్‌కి ఇది హ్యాట్రిక్ ప్రయత్నం ఎలాగో.. అలాగే కీర్తి సురేష్ కూడా తెలుగులో నటిస్తున్న మూడో చిత్రమిదే. ఆమె నటించిన గత రెండు చిత్రాలు నేను శైలజ, నేను లోకల్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లో త్రివిక్రమ్‌కిది నాలుగో సినిమా అయినా.. సన్నాఫ్ సత్యమూర్తి, అఆ తరువాత వరుసగా చేస్తోన్న మూడో సినిమా. సో.. పవన్ 25వ చిత్రం హిట్ అయితే మూడు హ్యాట్రిక్స్ సొంతం అవుతాయన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com