పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ 15 సినిమాలు..
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలంటే బీభత్సమైన టాలెంట్‌తో పాటు.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. అవకాశాల కోసం ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ చెప్పులరిగే దాకా స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎప్పటికో గానీ వారికి కాలం కలిసి రాదు. కానీ దీనికి పరిష్కారం చూపే దిశగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని.. సక్సెస్ కావాలని తపించే వారికి పవన్.. టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి గొప్ప అవకాశం కల్పించి వారి జీవితాలను మంచి టర్న్ ఇవ్వబోతున్నారు. దీని కోసం ఇప్పటికే రంగం సిద్ధమైంది.
వినూత్న ఆలోచనలు కలిగిన రచయితలను, ఆ విధమైన కథలు చెప్పగలిగే దర్శకులను... బహు భాషల్లో మన కథలను తీసుకువెళ్లగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌ను స్థాపించారు. అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నిర్మాత టి.జి.విశ్వప్రసాద్. ఈ సంస్థ ద్వారా వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సంయుక్తంగా 15 సినిమాలను నిర్మిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
కాగా విశ్వప్రసాద్ తన నిర్మాణ సంస్థ ద్వారా అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించి పదికిపైగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పీ సంస్థలు యంగ్ టాలెంటెడ్కు అవకాశం కల్పించేందుకు సిద్ధమయ్యాయి. దీనికోసం ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధమైంది. యువ ప్రతిభావంతుల స్వచ్ఛమైన ఆలోచనలు... కలలు కార్యరూపం దాల్చే వేదికగా ఇది రూపుదిద్దుకోనుంది. దీనికి హరీష్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నిర్మాణ సంస్థల కలయికలో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు... 6 మధ్యతరహా చిత్రాలు... 3 భారీ చిత్రాలు నిర్మించబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments