ఆ..డేట్ కోసం పవన్, బన్ని మధ్య ఫైట్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మాత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోరూపొందుతున్న బ్రహ్మాత్సవం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నూతన సంవత్సర కానుకగా రిలీజైన బ్రహ్మాత్సవం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు సూపర్ స్టార్ క్రిష్ణ. మహేష్ బ్రహ్మాత్సవం రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సింది పవర్ స్టార్ సర్ధార్ గబ్బర్ సింగ్, స్టైలీష్ స్టార్ సరైనోడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ రోజు నుంచి హైదరాబాద్ భూత్ బంగ్లాలో సర్ధార్ సందడి మొదలైంది. 27 రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్ లో పవన్, కాజల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నతాజా చిత్రం సరైనోడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న సరైనోడు సినిమాని కూడా ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు. అందుచేత పుట్టినరోజు సందర్భంగా సరైనోడు సినిమాని ఏప్రిల్ 8నే రిలీజ్ చేయాలనుకుంటున్నారట. మరో పక్క పవన్ కూడా ఏప్రిల్ 8 నే సర్ధార్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అందుచేత ఏప్రిల్ 8 కోసం పోటీ పడుతున్నారు పవన్, బన్ని. మరి..వీరిలో ఎవరికి ఏప్రిల్ 8 డేట్ దక్కుతుందో..? ఎవరి సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com