పట్టపగలు రిలీజ్ కాదా..
Send us your feedback to audioarticles@vaarta.com
రాజశేఖర్, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం పట్టపగలు. ఈ చిత్రంలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్ తండ్రి కూతురుగా నటించారు. కూతురుకి దెయ్యం పడితే తండ్రి ఏం చేసాడు..? ఎలాంటి కష్టాలు పడ్డాడు..? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. గత సంవత్సరం మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కాలేదు.
ఎందుకంటే...ఈ సినిమాలో కొన్ని సీన్స్ రాజశేఖర్, జీవితలకు నచ్చలేదట. ఆ సీన్స్ రీషూట్ చేద్దాం అన్నారట. అది రామ్ గోపాల్ వర్మకు నచ్చలేదట. సినిమాను జీవిత, రాజశేఖర్ కి అప్పచెప్పేసాడట వర్మ. జీవిత రాజశేఖర్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ రీషూట్ చేద్దాం అనుకున్నా..ఇప్పుడు పట్టపగలు గురించి ఆసలు ఆలోచించడం లేదట. పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాడట రాజశేఖర్. సో...పట్టపగలు ఇప్పట్లో రిలీజ్ కి రానట్టే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments