వరంగల్ ఎంజీఎంలో దారుణం: ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి.. విచక్షణారహితంగా కొరికేసిన మూషికాలు
Send us your feedback to audioarticles@vaarta.com
వేలు, లక్షలు పోసి కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. కానీ సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత కారణంగా పేదలకు వైద్యం అందడం లేదు. ఒకవేళ అక్కడికి వెళ్లినా ఎన్నో దారుణ పరిస్ధితుల మధ్య గడపాల్సి వుంటుంది. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.
వివరాల్లోకి వెళితే... ఆర్‌ఐసీయూలో ఓ రోగి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గతకొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో నాలుగు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
అయితే ఎంజీఎంలో చేరిన తొలిరోజే రోగి శ్రీనివాస్ కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. వెంటనే కుటుంబసభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు గాయాలకు కట్టుకట్టారు. కానీ గురువారం ఉదయం కూడా శ్రీనివాస్ ఎడమ చేయితో పాటు కాలి వేళ్లు, మడమ వద్ద ఎలుకలు కొరికేయడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు మళ్లీ కట్టుకట్టి చికిత్స అందించారు. మరోవైపు ఎలుకల బెడదపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆర్‌ఎంవో మురళి దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో కలిసి ఆయన ఐసీయూకి వచ్చి పరిశీలించారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com