Hospital:దారుణం: స్ట్రెచర్ లేక కొడుకుని ఈడ్చుకెళ్లిన తల్లిదండ్రులు.. భగ్గుమంటోన్న నెటిజన్లు, హరీశ్ రావు సీరియస్
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని ప్రజలకు ఇప్పటికీ విద్య, వైద్యం, ఇతర సదుపాయాలు సవ్యంగా అందడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రులు నేటికీ మారడం లేదు. కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోలేని పేదలకు ప్రభుత్వ దవాఖానాలే దిక్కు. అయినప్పటికీ అక్కడి సౌకర్యాల లేమి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో పేషెంట్ కాళ్లను పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లారు రోగి తల్లిదండ్రులు.
చూస్తూ వుండిపోయిన ఆసుపత్రి సిబ్బంది :
ఈ ఆసుపత్రికి ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో వచ్చాడు. అయితే ఆ సమయంలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగి బంధువులే అతనిని నేలపై పడుకోబెట్టి, రెండూ కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అక్కడి సిబ్బంది సైతం ఈ దృశ్యాన్ని చూస్తూ వుండిపోయారే కానీ ఏం చేయలేకపోయారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యింది.
విచారణకు ఆదేశించిన హరీశ్ రావు :
ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆదేశించారు. మరోవైపు .. ఈ వ్యవహారంలో తమ సిబ్బంది తప్పేమి లేదంటున్నారు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెట్ . వీల్ చైర్ తీసుకొచ్చేలోపే లిఫ్ట్ వచ్చిందని.. ఆ వెంటనే రోగి బంధువులే అతనిని లోపలికి లాక్కెళ్లిపోయారని చెప్పారు. దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యిందని సూపరింటెండెంట్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com