Hospital:దారుణం: స్ట్రెచర్ లేక కొడుకుని ఈడ్చుకెళ్లిన తల్లిదండ్రులు.. భగ్గుమంటోన్న నెటిజన్లు, హరీశ్ రావు సీరియస్

  • IndiaGlitz, [Saturday,April 15 2023]

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దేశంలోని ప్రజలకు ఇప్పటికీ విద్య, వైద్యం, ఇతర సదుపాయాలు సవ్యంగా అందడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రులు నేటికీ మారడం లేదు. కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోలేని పేదలకు ప్రభుత్వ దవాఖానాలే దిక్కు. అయినప్పటికీ అక్కడి సౌకర్యాల లేమి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో పేషెంట్ కాళ్లను పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లారు రోగి తల్లిదండ్రులు.

చూస్తూ వుండిపోయిన ఆసుపత్రి సిబ్బంది :

ఈ ఆసుపత్రికి ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో వచ్చాడు. అయితే ఆ సమయంలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగి బంధువులే అతనిని నేలపై పడుకోబెట్టి, రెండూ కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అక్కడి సిబ్బంది సైతం ఈ దృశ్యాన్ని చూస్తూ వుండిపోయారే కానీ ఏం చేయలేకపోయారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యింది.

విచారణకు ఆదేశించిన హరీశ్ రావు :

ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను ఆదేశించారు. మరోవైపు .. ఈ వ్యవహారంలో తమ సిబ్బంది తప్పేమి లేదంటున్నారు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెట్ . వీల్ చైర్ తీసుకొచ్చేలోపే లిఫ్ట్ వచ్చిందని.. ఆ వెంటనే రోగి బంధువులే అతనిని లోపలికి లాక్కెళ్లిపోయారని చెప్పారు. దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యిందని సూపరింటెండెంట్ తెలిపారు.

More News

Pawan Kalyan :పార్టీలో అన్నయ్యకు కీ రోల్.. జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు, పవన్ సంచలన నిర్ణయం

జనసేన అంటే పవన్ .. పవన్ అంటే జనసేన.. ఇప్పటి వరకు ఇలా వున్న పరిస్ధితిని పవన్ కల్యాణ్ మార్చాలని నిర్ణయించుకున్నారు.

వెయ్యి మందితో యాక్షన్ ఎపిసోడ్.. ఉస్తాద్ భగత్ సింగ్‌ నుంచి క్రేజీ అప్‌డేట్, ఫుల్ స్వింగ్‌లో పవన్

దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం హరీశ్ శంకర్ ఏళ్ల పాటు ఎదురుచూశారు.

CM KCR:హైదరాబాద్‌కు మరో మణిహారం : 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్..  ప్రత్యేకతలివే

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్

Vimanam:తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధాన్ని ఆవిష్క‌రించే ‘విమానం’... ప్రోమో

జీవితంలో ఏదో సాధించాల‌ని మ‌న‌కు చెప్పే పాత్ర‌ల‌ను వెండితెర‌పై చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తారు.

JC Prabhakar Reddy:ఇంత కష్టమా, కాలికి బొబ్బలొచ్చినా లెక్క చేయట్లే.. లోకేష్‌‌ని చూసి కంటతడిపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.