షూటింగ్ ముగించుకున్న'ప్రతి రోజు పండగే' బృందం
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని మైండ్ బ్లోయింగ్ డాన్స్ నెంబర్ సాంగ్ అన్నపూర్ణ స్థూడియోస్ లో వేసిన గ్రాండ్ సెట్లో చిత్రీకరణజరుపుకుంటోంది . ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అద్భుతమైన థీమ్, కలర్ ప్యాట్రన్ లో సెట్ వేశారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమంచిన ఈ ఎనెర్జిటిక్ సాంగ్ కోసం సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. శ్రీ జో ఈ పాటకు సాహిత్యం అందించారు. నవంబర్ 30 రాశి ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ - " గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి గతంలో 'భలే భలే మొగాడివోయ్' సినిమా తీశాం. అది బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది. దాని తర్వాత మళ్ళీ అదే టీమ్ కలిసి చేస్తోన్న చిత్రం 'ప్రతి రోజు పండగే'. దర్శకుడు మారుతికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఒక సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా తీసుకెళ్లి మనకు తెలియకుండా మంచి మెస్సేజ్ ని మనలో ఎక్కించే నేర్పరి తనం ఉండే బహుకొద్ది మందిలో మారుతి ప్రధమ శ్రేణిలో ఉంటారు. ఈ సినిమా కథ ముఖ్యంగా ఎన్ ఆర్ ఐ గురించి చెప్పిన స్టోరీ. ఇక్కడ ఉన్న వారితో కనెక్ట్ కాకుండా ఎలాఇబ్బందిపడుతున్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా కాలం నుండి సాయితో సినిమా చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. అలాగే రాశితో కూడా అలానే కుదిరింది. రాశి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తనతో 2020 లో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - " భలే భలే మొగాడివోయ్ చిత్రంతో ఈ రెండు బేనర్స్ ని కలిపాను. అరవింద్ గారి ప్రొడక్షన్ లో సినిమా తీస్తున్నప్పుడు ప్రతి షాట్ కి ఇది అరవింద్ గారి సినిమా వొళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి అనే భాద్యత అరవింద్ గారు మాకు కనపడక పోయినా ఆయన ఇన్ఫ్లుయన్స్ మాత్రం మా అందరిలో ఉంటుంది. నాకు వొచ్చిన ఒక థాట్ ను అరవింద్ గారు ఇచ్చిన నమ్మకంతో ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్లగలిగాను. గీతా ఆర్ట్స్ లో ఎన్నో మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అలాంటి ఒక రెస్పాన్సిబుల్ ఫిలిం ప్రతి రోజు పండగే. ఈ సినిమాకి సత్యరాజ్ గారు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. అలాగే రవిశంకర్ గారు ఈ సినిమాని ప్రేమించి సత్యరాజ్ గారికి వాయిస్ ఇవ్వడం జరిగింది. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. వంశి, వాసు పర్ఫెక్ట్ గా నన్ను జడ్జ్ చేస్తూ వచ్చారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. జయ కుమార్ విజువల్ కొత్తగా ఉంటాయి. రాశి సింపుల్ గా ఉండే బబ్లీ అమ్మాయి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ ఆమె క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఈరోజు తో సాంగ్ పూర్తియింది. డిసెంబర్ 20 న సినిమా రిలీజ్ అవుతుంది. అన్ని ఏజ్ గ్రూప్ ల వారు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ మీల్స్ భోజనం లా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ గా ఉంటూనే మంచి మెసేజ్ కూడా ఉంటుంది" అన్నారు.
థమన్ మాట్లాడుతూ - " చాలా హార్ట్ టచింగ్ స్క్రిప్ట్. మారుతి ఈ సినిమాతో వెరీ బిగ్ హిట్ ఇవ్వబోతున్నాడు. సినిమా మంచి మ్యూజిక్ కోసం హంగ్రీ గా ఉంది. సినిమా బాగుంటే కానీ మంచి మ్యూజిక్ అడగదు. అలాగే మంచి ఆర్ ఆర్ కుదిరింది. మారుతి ఈ కథ చెప్పనప్పుడే మమ్ములనందరిని కదిలించింది. మారుతి ఈ సినిమా ద్వారా తేజ్ కి నాకు పెద్ద సక్సెస్ ఇవ్వబోతున్నందుకు హ్యాపీ గా ఉంది. అందరిని ఎమోషనల్ గా కదిలిస్తుంది సినిమా. ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, మారుతి గారికి ధన్యవాదాలు" అన్నారు.
రాశి ఖన్నా మాట్లాడుతూ - " ఈరోజుతో షూటింగ్ పూర్తయింది. ప్రతి సినిమా షూటింగ్ అయిపోగానే అందరం బాధపడతాం. కానీ ఈ సినిమాకి అందరం హ్యాపీ మోడ్ లో ఉన్నాం. ఈ సినిమా నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. యూవీ లో జిల్ సినిమా చేశాను. చాలా మంచి ప్రొడక్షన్ హౌస్. అలాగే ఎప్పటినుండో గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయాలి అనుకుంటున్నా ఇప్పుడు కుదిరింది. మారుతి గారు చాలా క్లారిటీ తో తీశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీ అందరికి కనెక్ట్ అవుతుంది. సాయి నైస్ కో స్థార్" అన్నారు.
సాయి తేజ్ మాట్లాడుతూ - "గీతా ఆర్ట్స్ , యువి క్రియేషన్స్ లో ఎప్పటినుండో సినిమా చేయాలి అనేది నా కోరిక. వారిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ 'ప్రతి రోజు పండగే'. అరవింద్ గారు నేను ఇండస్ట్రీ కి వచ్చినప్పటినుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. అలాగే సత్యరాజ్ గారి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. థమన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. రాశి క్యారెక్టర్ ఫన్నీ గాఉంటుంది. మారుతి గారి స్పీడ్ ని మ్యాచ్ చేస్తూ జయ కుమార్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఇంతమంది ఆర్టిసులని కలిపి ఒక మంచి సినిమా తీసిన మారుతి గారికి థాంక్స్. రేపు మా సినిమా నుండి మూడో పాట విడుదలవుతుంది. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా" అన్నారు.
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ - " భలే భలే మొగాడివోయ్ తర్వాత గీతా ఆర్ట్స్ , యువి క్రియేషన్స్ లో నేను చేస్తున్న సినిమా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్యూ" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments