'ప‌టాస్' రీమేక్ అప్‌డేట్‌

  • IndiaGlitz, [Thursday,November 12 2015]

తెలుగులో ఘ‌న‌విజ‌యం సాధించిన క‌ళ్యాణ్ రామ్ 'ప‌టాస్' మూవీ.. త‌మిళంలో రీమేక్‌గా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. లారెన్స్ రాఘ‌వ క‌థానాయ‌కుడుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ గ‌ల్‌రాణి హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగులో సాయికుమార్ పోషించిన పాత్ర‌ని స‌త్య‌రాజ్ చేయ‌నుండ‌గా.. ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో స‌తీష్‌, తంబి రామ‌య్య‌, కోవై స‌ర‌ళ‌, దేవ ద‌ర్శిని, మ‌నోబాల వంటి ప్ర‌ముఖ త‌మిళ తార‌లు సంద‌డి చేయ‌నున్నారు.

సాయి ర‌మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి అమ్రీష్ సంగీత ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే.. ఈ నెల 18న ప్రారంభ‌మ‌య్యే షెడ్యూల్‌ని నెల రోజుల పాటు కొన‌సాగించ‌నున్నారు. హైద‌రాబాద్‌, హాంగ్‌కాంగ్‌, స్విట్జ‌ర్లాండ్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. లారెన్స్ రాఘ‌వ హీరోగా న‌టించ‌నున్న ఓ సినిమాకి అనుకున్న 'మొట్ట శివ కెట్ట శివ' పేరుని 'ప‌టాస్' రీమేక్ కి మార్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

More News

డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్న న‌య‌న‌తార‌

వ‌రుస‌గా మూడు నెల‌ల్లో మూడు సూప‌ర్ హిట్ సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌.

వైజాగ్ బీచ్ లో శంక‌రాభ‌ర‌ణం ట్రిఫుల్ ప్లాటినం

నిఖిల్, నందిత జంట‌గా న‌టిస్తున్న చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు నంద‌న‌వ‌నం తెర‌కెక్కించారు.

నవంబర్‌ 14న 'శ్రీమంతుడు' సైకిల్‌ విజేతను ఎంపిక చేయనున్న సూపర్‌స్టార్‌ మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'.

చ‌ర‌ణ్ కొత్త నిర్ణ‌యం..

బ్రూస్ లీ సినిమా విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో రామ్ చ‌ర‌ణ్ లో చాలా మార్పు వ‌చ్చింద‌ట‌. ముఖ్యంగా పారితోషికం విష‌యంలో ఇక నుంచి రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండా...లాభాల్లో షేర్ తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌.

స‌మంత‌తో అమీకి సీన్స్ లేవ‌ట‌

'రాజా రాణి' వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ త‌రువాత అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌మంత‌, అమీ జాక్స‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.