'పటాస్' రీమేక్ అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో ఘనవిజయం సాధించిన కళ్యాణ్ రామ్ 'పటాస్' మూవీ.. తమిళంలో రీమేక్‌గా రూపొందనున్న సంగతి తెలిసిందే. లారెన్స్ రాఘవ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రంలో నిక్కీ గల్‌రాణి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో సాయికుమార్ పోషించిన పాత్రని సత్యరాజ్ చేయనుండగా.. ఇతర ముఖ్య పాత్రల్లో సతీష్, తంబి రామయ్య, కోవై సరళ, దేవ దర్శిని, మనోబాల వంటి ప్రముఖ తమిళ తారలు సందడి చేయనున్నారు.
సాయి రమణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమ్రీష్ సంగీత దర్శకుడు. ఇదిలా ఉంటే.. ఈ నెల 18న ప్రారంభమయ్యే షెడ్యూల్‌ని నెల రోజుల పాటు కొనసాగించనున్నారు. హైదరాబాద్, హాంగ్‌కాంగ్, స్విట్జర్లాండ్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారని సమాచారం. లారెన్స్ రాఘవ హీరోగా నటించనున్న ఓ సినిమాకి అనుకున్న 'మొట్ట శివ కెట్ట శివ' పేరుని 'పటాస్' రీమేక్ కి మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com