'పటాస్' డైరెక్టర్ ఫార్ములా మిస్ కావడం లేదు
Send us your feedback to audioarticles@vaarta.com
2015లో తొలి ఘనవిజయంగా 'పటాస్' మూవీ క్రెడిట్ దక్కించుకుంది. కళ్యాణ్‌రామ్ కి రాంగ్ టైమ్ నడుస్తున్న టైంలో రైట్ రిజల్ట్ ఇచ్చిన ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి డైరెక్టర్ గా డెబ్యూ ఇచ్చాడు. ఈ సినిమాతో కళ్యాణ్‌కి ఎంత పేరు వచ్చిందో.. దర్శకుడు అనిల్‌కి అంతే పేరు వచ్చింది. దీంతో అనిల్ సెకండ్ మూవీపై అందరి దృష్టి పడింది.
దిల్ రాజు నిర్మాతగానూ.. సాయిధరమ్ తేజ, రాశీ ఖన్నా జంటగానూ అనిల్ తన ద్వితీయ ప్రయత్నాన్ని 'సుప్రీమ్' పేరిట ఇటీవలే ప్రారంభించడమే కాకుండా.. శరవేగంగా రూపొందిస్తున్నాడు కూడా. మొదటి సినిమా 'పటాస్'లో సక్సెస్ అయిన రెండు అంశాలను రెండో సినిమాలోనూ కంటిన్యూ చేస్తూ సదరు దర్శకుడు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాడు.
ఇంతకీ అవేమిటంటే.. పటాస్‌లో కళ్యాణ్‌ది పోలీస్ పాత్ర అయితే.. ఇందులో హీరోయిన్ రాశిదీ పోలీస్ రోల్. ఇక రెండో పాయింట్ ఏమిటంటే.. పటాస్ కోసం కళ్యాణ్ బాబాయ్ బాలకృష్ణ పాట ('రౌడీ ఇన్స్ పెక్టర్'లోని 'అరె వో సాంబ')ని రీమిక్స్ చేస్తే.. 'సుప్రీమ్' కోసం సాయిధరమ్ మేనమామ చిరంజీవి పాట ('యముడికి మొగుడు'లోని 'సుప్రీం హీరో')ని రీమిక్స్ చేయబోతున్నాడట. ఈ రెండు సినిమాలకూ సాయి కార్తీక్ సంగీత దర్శకుడు కావడం విశేషం. ఏదీఏమైనా.. ఫస్ట్ పిక్చర్తో నందమూరి అభిమానులను ఖుషి చేసిన అనిల్.. రెండో సినిమా కోసం అవే ఫార్ములాలను వాడుకుంటూ మెగా ఫ్యాన్స్‌ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments