ఆగస్టులో 'ఏ1 మహేంద్ర క్రియేషన్స్' గోగుల నరేంద్ర నిర్మిస్తున్న 'సావిత్రి w/o సత్యమూర్తి'

  • IndiaGlitz, [Saturday,July 10 2021]

అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం కలిసుండాలని ఎలా నిర్ణయించుకున్నారు? అనే కథాంశంతో రూపొందుతున్న స్వచ్ఛమైన వినోదాత్మక కుటుంబకథా చిత్రం 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. పాతికేళ్ల కుర్రాడిగా పార్వతీశం ('కేరింత' ఫేమ్, నూకరాజుగా నటించిన హీరో), అతని భార్య పాత్రలో అరవైయేళ్ల మహిళగా హాస్యనటి శ్రీలక్ష్మి వెండితెరపై సందడి చేయనున్నారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రమిది. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాం. త్వరలో వాళ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. హైదరాబాద్, అరకు, ఈస్ట్ గోదావరి, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 45 రోజులు చిత్రీకరణ చేశాం. విశాఖలో గుమ్మడికాయ కొట్టేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి ఆగస్టు మూడో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్ని వర్గాలను, అన్ని వయసుల వాళ్లను అలరించే చిత్రమిది అని అన్నారు.

శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఎల్లారెడ్డి, ఎడిటర్: మహేష్, మ్యూజిక్ డైరెక్టర్: సత్య కశ్యప్, లిరిక్స్ - రాంబాబు గోశాల , సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల, ప్రొడ్యూసర్: గోగుల నరేంద్ర, కథ - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్: చైతన్య కొండ.

More News

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. తుదిశ్వాస విడిచిన కత్తి మహేష్

తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేష్ మృతి చెందారు.

మోహన్ బాబుపై వ్యక్తిగత దూషణలు, బూతులతో.. పోలీసులకు ఫిర్యాదు

సీనియర్ నటుడు మోహన్ బాబు సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు.

ఒక వ్యక్తిని ప్రేమించా.. బ్రేకప్ జరిగింది: అనుపమ పరమేశ్వరన్

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది.

పిడి గుద్దుల్లాంటి పంచ్ లు.. వరుణ్ తేజ్ భీకరమైన బాక్సింగ్ పోరాటం!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న హై యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'గని' చివరి షెడ్యూల్ కి చేరుకుంది.

ప్రభాస్ మెమొరబుల్ పోస్ట్.. ఇండియన్ సినిమా సరికొత్త అధ్యాయానికి 6 ఏళ్ళు!

బాహుబలి.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఎన్నో అనుమానాలు, సవాళ్లు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఇంత బడ్జెట్ లో తెరకెక్కించడం రిస్క్ కదా అని పెదవి విరిచినవారు లేకపోలేదు.