గీతాఆర్ట్స్ లో పరుశురాంకు మరో అవకాశం
Send us your feedback to audioarticles@vaarta.com
యువత, సోలో చిత్రాలు తర్వాత డైరెక్టర్ పరుశురాంకు ఆంజనేయులు, సారొచ్చారు చిత్రాలు ఆశించినంత సక్సెస్‌ను తెచ్చిపెట్టలేకపోయాయి. 2012 తర్వాత దర్శకుడు పరుశురాం నాలుగేళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమాయే శ్రీరస్తు శుభమస్తు. గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల మన్నలు అందుకున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్, లావణ్య, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు ప్రధాన తారాగణంగా నటించారు.
గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పరుశురాం వర్కింగ్ స్టయిల్‌ను గమనించిన నిర్మాత అల్లు అరవింద్, శ్రీరస్తు శుభమస్తు చిత్రం విడుదలకు 40 రోజుల ముందే గీతాఆర్ట్స్ బ్యానర్లో మరో సినిమా చేయమని ఆఫర్ ఇచ్చాడట. ఈ విషయాన్ని దర్శకుడు పరుశురాం తెలియజేశాడు. మరి పరుశురాం ఈసారి ఎలాంటి కథతో గీతాఆర్ట్స్ లో సినిమాను రూపొందిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com