బాలయ్య కోసం మరోసారి.. పరుచూరి

  • IndiaGlitz, [Tuesday,May 22 2018]

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్ర‌ముఖ‌ నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్రారంభించ‌నున్నారు. నిరవధికంగా చిత్రీకరణను జ‌రిపి.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందిస్తున్నట్లు సమాచారం. గతంలో బాలకృష్ణ నటించిన ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఈ ద్వయం మాటలను అందించారు. అలాగే.. బాలయ్య, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాకి కూడా వీరే సంభాషణలు రాయడం విశేషం. వీరి క‌లం నుంచి వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్స్‌కి బాలయ్య నటన తోడైతే థియేటర్‌లలో అభిమానుల ఆనందానికి హ‌ద్దు ఉండ‌ద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

More News

నాగార్జున వెర్స‌స్ స‌మంత‌

అక్కినేని నాగార్జున, చెన్నై బ్యూటీ సమంత కలిసి ఇంత‌కుముందు ‘మనం’, ‘రాజుగారిగది2’ సినిమాల్లో పోటీ ప‌డి మరీ నటించారు.

సునీల్ సంద‌డంతా అప్పుడే..

‘నువ్వేకావాలి’ సినిమాతో హాస్య‌న‌టుడిగా ప‌రిచ‌య‌మైన‌ సునీల్‌.. అన‌తి కాలంలోనే టాప్ క‌మెడీయ‌న్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారిగా..

2001లో విడుద‌లైన‌ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

అక్క‌డ హ‌వా కొన‌సాగిస్తున్న మిక్కీ

క్లాస్‌ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. ఇప్పటివరకు ఈ స్వరకర్త కెరీర్‌ను పరిశీలిస్తే.. తన క్లాస్ అండ్ మెలోడీ మ్యూజిక్‌

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్న విజ‌య్‌..

‘అర్జున్ రెడ్డి’ విజయం తర్వాత చేతినిండా సినిమాలతో బిజీగా మారిన నటుడు యూత్ స్టార్ విజయ్ దేవరకొండ.