‘మా’లో తారాస్థాయికి విభేదాలు.. పరుచూరి కంటతడి
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం నాడు జరిగిన మా అసిసోయేషన్ మీటింగ్ గందరగోళంగా మారింది. ‘మా’ అధ్యక్షుడు నరేష్, రాజశేఖర్ వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో కొందరు సభ్యులు అలిగి సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. సమావేశానికి కోర్టు నుంచి అనుమతి పొందామని రాజశేఖర్ వర్గం చెబుతోంది. మరోవైపు.. ఈ సమావేశం చెల్లదంటూ సభ్యుల ఫోన్లకు నరేష్ మెసేజ్లు పంపారు.
పరుచూరి కంటతడి!
‘మా’ సభ్యుల మనోగతాన్ని తెలుసుకునేందుకు సమావేశమవుదామంటూ సీనియర్ నటుడు కృష్ణంరాజు సూచించారు. ఈ క్రమంలో.. కొందరు సభ్యులు అలిగి వెళ్లిపోగా.. పరుచూరి గోపాలకృష్ణ కంటతడిపెడుతూ సమావేశం నుంచి వెళ్ళిపోయారు. అయితే పరుచూరి కంటతడి పెట్టడానికి కారణమేంటి..? ఆయన్ను సమావేశంలో ఎవరైనా ఏమైనా అన్నారా..? లేకుంటే మరేం జరిగింది..? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ‘మా’ ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. ఈ వివాదాలకు ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో అని సినీ ఆర్టిస్టుల్లో ఆందోళన నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout