భలే మంచిరోజు సినిమాలో నటించడం ఓ అందమైన అనుభూతి - పరుచూరి గోపాలక్రిష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
సుధీర్ బాబు హీరోగా నూతన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం భలే మంచిరోజు. 70 ఎం.ఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ రెడ్డి, శశిధర రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన భలే మంచిరోజు చిత్రం ఈనెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సీనియర్ రచయిత, నటుడు పరుచూరి గోపాలక్రిష్ణ చెప్పిన భలే మంచిరోజు విశేషాలు మీకోసం....
రెండు ఆనందాల్ని ఇచ్చింది...
భలే మంచిరోజు సినిమాలో నటించడం నాకు రెండు ఆనందాల్ని ఇచ్చింది. అందులో మొదటిది మా అన్నయ్య చదువుకోలేదు. అందుచేత మెకానిక్ గా సెటిల్ అయ్యాడు. ఆయన ఈ మధ్య చనిపోయారు. ఇందులో నేను మెకానిక్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అన్నయ్య గుర్తుకువచ్చారు. మెకానిక్ గా ఆయన మాట్లాడే విధానం దగ్గర నుంచి చూసాను. అది నా క్యారెక్టర్ కి వాడుకున్నాను. ఇక రెండోది ఎన్టీఆర్, క్రిష్ణ మాకు రెండు కళ్లు లాంటి వాళ్లు. ఇండస్ట్రీలో ప్రవేశించగానే ఎన్టీఆర్, క్రిష్ణ వాళ్లు చేసే సినిమాల్లో 80% సినిమాలకు సంభాషణలు రాసే అవకాశం మాకు ఇచ్చి ప్రొత్సహించారు. అలాంటి క్రిష్ణ గారి అల్లుడు సుధీర్ బాబుకి తండ్రిగా నటించడం ఆనందంగా ఉంది.
నేచురల్ ఆర్టిస్ట్...
సుధీర్ బాబు నేచురల్ ఆర్టిస్ట్. పాత్రకు తగ్గట్టు చాలా బాగా నటిస్తున్నాడు. తన గత చిత్రాల్లో కూడా పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. ఈ సినిమాలో తన నటనతో సుధీర్ బాబు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. భలే మంచిరోజు ఖచ్చితంగా సుధీర్ బాబుకు ఓ మంచి చిత్రంగా నిలుస్తుంది.
క్రిష్ణవంశీ తర్వాత ఇతనే...
ఆర్టిస్ట్ ల నుంచి నటనను ఎలా రాబట్టాలో క్రిష్ణవంశీ కి బాగా తెలుసు. క్రిష్ణవంశీ తర్వాత అలా ఆర్టిస్ట్ ల నుంచి నటను రాబట్టే డైరెక్టర్ అంటే శ్రీరామ్ నే చూసాను. తనకు నటీనటుల నుంచి ఎలాంటి నటన కావాలో నటించి చూపించి మరీ...తనకు కావాల్సిన విధంగా చేయించుకునేవాడు. ఖచ్చితంగా శ్రీరామ్ మంచి డైరెక్టర్ అవుతాడు.
మంచి నిర్మాత..
నిర్మాతల్లో రెండు రకాల నిర్మాతలు ఉంటారు. ఒకటి కథలో వేలుపెట్టే నిర్మాతలు.రెండు రైటర్, డైరెక్టర్ కథ ఓకె చేసిన తర్వాత అసలు కథలో వేలు పెట్టని నిర్మాతలు. కథ ఓకె చేసిన తర్వాత ఏమాత్రం వేలు పెట్టని నిర్మాత విజయ్. షూటింగ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు.ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం.
ఒక రోజులోజరిగే కథ..
భలే మంచిరోజు కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ కథలో ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇక కథ విషయానికి వస్తే..గాలికి తిరిగే ఓ యువకుడికి ఓ యాక్సిడెంట్ వలన అందమైన అమ్మాయి లభించే రోజే భలే మంచిరోజు.
నేచురల్ డైలాగ్స్..
ఈ సినిమాలో ప్రతి డైలాగ్..పాత్రకు తగ్గట్టు, ఆ సన్నివేశానికి తగ్గట్టు ఉంటుంది. డైలాగ్స్ ఏదో పంచ్ కోసం రాసినట్టు...కావాలని పెట్టినట్టు అసలు అనిపించదు. చాలా నేచురల్ గా ఉంటాయి. అలాగే చాలా షార్ట్ గా కూడా ఉంటాయి. నేను భలే మంచిరోజు సినిమాలో నటించడం ఓ అందమైన అనుభూతి. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండే భలే మంచిరోజు ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments