పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ ఎంపీకి షాక్..

  • IndiaGlitz, [Monday,September 14 2020]

పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎంపీలంతా ఢిల్లీ చేరుకున్నారు. వీరికి పార్లమెంట్ సచివాలయంలో ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో వైసీపీ ఎంపీకి షాక్ తగిలింది. ఏమాత్రం కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు అధికారులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. మరోవైపు కాకినాడ ఎంపీ వంగా గీతకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

శనివారం నిర్వహించిన పరీక్షల్లో వంగా గీతకు పాజిటివ్‌ అని తేలింది. కాగా.. కరోనా లక్షణాలున్నా కూడా పార్లమెంటులోకి అనుమతించబోమని లోక్‌సభ స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ఎంపీలందరినీ పరీక్షించి.. ఫలితం వచ్చిన తరువాత మాత్రమే సభలోకి అనుమతించనున్నారు. కాగా.. పార్లమెంట్ వర్షాకా సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేశారు.

ఇటీవలే మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, సిట్టింగ్ సభ్యుడు వసంత్ కుమార్‌ల మృతికి సంతాపం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశాల్లో చేపట్టిన పలు మార్పులపై ప్రవేశపెట్టనున్న తీర్మానంలో క్వశ్చన్ అవర్ రద్దు, జీరో అవర్ కుదింపు, సభా సమయం కుదింపు తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. పటిష్టమైన నిబంధనల నడుమ ఈ సమావేశాలు జరుగుతున్నాయి.