29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
- IndiaGlitz, [Friday,January 15 2021]
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనవరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్నాయి. జనవరి 29న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రసంగం తరువాత ఎకనమిక్ సర్వేను విడుదల చేయనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న 11 గంటలకు కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22కు గాను.. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 8 వరకూ 20 రోజలు పాటు విరామానంతరం బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఏప్రిల్ 8తో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయని లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంట్ సమావేశాలు పెద్దగా జరిగింది లేదు. సెప్టెంబర్‌లో వర్షాకాల సమావేశాలు జరిగాయి. అవి కూడా ఏడు రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయి. అయితే పలువురు ఎంపీలకు కరోనా వైరస్ సోకడంతో సమావేశాలు అప్పుడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి నవంబర్-డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహించకూడదని నిర్ణయించింది.