తెరాస, మహాకూటమి లకు ఓటమి తప్పదు: పరిపూర్ణనంద స్వామి

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు 5 వేల మందితో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పరిపూర్ణనంద స్వామి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బారి బహిరంగ సభలో పాల్గొన్న స్వామి పరిపూర్ణానంద తెరాస, మహా కూటమి పై సంచలన వాఖ్యలు చేసారు. 

దుబ్బాకలో తెరాస, మహా కూటమి ల ఓటమి కాయమని, డిసెంబర్ 11న రఘునందన్ రావు విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటానని పేర్కొన్నారు. దుబ్బాకలో 120 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని. రఘునందన్ రావు గెలిచిన తర్వాత బీడి కార్మికులను ఆదుకుంటారని తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి రాగానే రైతులను అదుకుంటాం.  కిలో బియ్యాన్నికి 28 రుపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నారు. కారు గుర్తు గెలిస్తే మనం గల్లిలోనే ఉంటాం. బిజెపి గెలిస్తే ఢిల్లీలో ఉంటాం. సర్వేలో దుబ్బాక గెలుస్తుందని తెలిసింది. బిజెపి గేలిస్తే ఒక రుపాయి అవినీతి లేకుండా పాలన కోనసాగుతుంది. దుబ్బాకలో బిజెపిని అత్యధిక మోజర్టితో గెలిపించాలని కోరారు.